హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Mythri Movie Makers: ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతున్న మరో బాలీవుడ్ డైరెక్టర్

Prabhas - Mythri Movie Makers: ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతున్న మరో బాలీవుడ్ డైరెక్టర్

ప్రభాస్ (Prabhas)

ప్రభాస్ (Prabhas)

Prabhas - Mythri Movie Makers: ప్రభాస్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చేయబోయే సినిమాను బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించే అవకాశాలున్నాయని సమాచారం

  రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. త‌ర్వాత సాహో కూడా ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు ప్ర‌భాస్ చేతిలో నాలుగు ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. అందులో రాధేశ్యామ్ సెట్స్‌పై ఉంది. ఇది కాకుండా మ‌రో మూడు ప్రాజెక్ట్స్‌లో స‌లార్ సెట్స్‌పై ఉంటే..ఆదిపురుష్ త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూట్‌ను ప్రారంభించుకోనుంది. కాగా.. నాగ్ అశ్విన్ మూవీ వ‌చ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ఇది కాకుండా టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌గా పేరు తెచ్చుకుంటున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లోనూ ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది.

  లేటెస్ట్ స‌మాచారం కోసం ప్ర‌భాస్ కోసం మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ బాలీవుడ్ ద‌ర్శ‌కుడిని సంప్ర‌దిస్తున్నార‌ట‌. టాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసి దానికి ప్ర‌భాస్ ఇమేజ్‌ను యాడ్ చేయ‌డం కంటే, బాలీవుడ్ ద‌ర్శ‌కుడే సినిమాను డైరెక్ట్ చేస్తే చేయ‌బోయే సినిమాకు మ‌రింత హైప్ వ‌స్తుందిన మైత్రీ సంస్థ అధినేత‌లు న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ భావిస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించిన పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

  రీసెంట్‌గా ఉప్పెన‌తో భారీ హిట్‌ను ద‌క్కించుకున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు అగ్ర హీరోలంద‌రితోనూ సినిమాలు చేస్తుంది. వీరు రీసెంట్‌గా చెప్పిన లెక్క‌లో చూస్తే వీరి బ్యాన‌ర్ నుంచి తొమ్మిది భారీ చిత్రాలు రాబోతున్నాయి.

  Published by:Anil
  First published:

  Tags: Mythri Movie Makers, Prabhas

  ఉత్తమ కథలు