NBK Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు నందమూరి నట సింహం బాలకృష్ణ విలవిల లాడిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్లో ‘ఆదిత్య 369’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా టీవీల్లో ఎపుడొచ్చినా.. ప్రేక్షకులుకు టీవీలకు అతుక్కుపోతారు. తెలుగులో టైమ్ మిషన్ నేపథ్యంలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఆదిత్య 369 సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసారు. ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకెళ్లిన ఈచిత్రానికి సీక్వెల్‌గా ఆదిత్య 999 చేయనున్నట్టు గత కొన్నేళ్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఒకానొక సందర్భంలో బాలయ్య తన వందో సినిమాగా ఆదిత్య 999 చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు.
తాజాగా సింగీతం శ్రీనివాసరావును ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా స్క్రిప్ట్ కోసం తీసుకోవడంతో ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇపుడు నాగ్ అశ్విన్.. ప్రభాస్‌తో చేయబోయే సినిమాను ఏ జానర్లో తెరకెక్కిస్తాడనేది చెప్పలేదు. కానీ కొంత మంది ఈ సినిమాను జేమ్స్ బాండ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. కాదు టైమ్ మిషన్ నేపథ్యం అని మరికొందరు అంటున్నారు. ఏమైనా ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమా కథ మాత్రం మాములుగా ఉండదనేది టాక్. ఒకవేళ నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో టైమ్ మిషన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఇటువంటి సినిమాల్లో ఎంతో అనుభవం ఉన్న సింగీతంను ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాగ్ అశ్విన్..సీనియర్ డైరెక్టర్ సింగీతం సాయం తీసుకున్నట్టు సమాచారం.
అంతేకాదు ఈ సినిమా స్క్రిప్ట్‌తో పాటు స్క్రీన్ ప్లే విషయాల్లో సాయం చేయడానికి సింగీతంకు దాదాపు రూ. 5 కోట్ల వరకు పారితోషకం ఇస్తున్నట్టు సమాచారం. టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోయే చిత్రానికి ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు సాయం తీసుకోవడంలో నాగ్ అశ్విన్ ఎలాంటి మొహమాటం పడటం లేదు. ప్రభాస్ సినిమా కోసం సింగీతం లైన్లోకి రావడంతో బాలయ్యకు ఒక విధంగా ప్రభాస్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఒక ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాకు ఆదిత్య 369కు సీక్వెలా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ అది గనుక నిజమైతే.. బాలయ్యకు అంతకంటే పెద్ద షాక్ మరొకటి ఉండదు. మరోవైపు సింగీతం బాలయ్య కోసం అనుకున్న కథను ప్రభాస్ కోసం కేటాయించకపోవచ్చు. నాగ్ అశ్విన్ .. ప్రభాస్ కోసం కొత్త తరహా కథనే ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. ఏమైనా బాలయ్య ఆదిత్య 999 విషయాన్ని ఇంకా నాన్చకుండా తొందర్లేనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళితే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Balakrishna, Nag Ashwin, Prabhas, Singeetam Srinivasa Rao, Tollywood, Vyjayanthi Movies