రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడు మాములుగా లేదు. బాహుబలి తర్వాత నిజంగానే అసలు సిసలు బాహుబలిలా మారాడు. బాలీవుడ్ హీరోలు సైతం తలదన్నేలా వరుసగా క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్.. తన సినిమాలన్ని ప్యాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెబల్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పిరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఆ తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ఈ చిత్రానికి ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి క్లాసిక్ మూవీలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాస రావు కథ, స్క్రీన్ ప్లేతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజీ తీసుకొచ్చేందకు ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్గా ఫైనల్ చేసారు. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ షెహెన్షా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.అమితాబ్ బచ్చన్ తన సినిమాలో నటించడంపై ప్రభాస్ స్పందిస్తూ.. ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై స్పందిస్తూ.. అమితాబ్ బచ్చన్‌తో నటించాలనే తన చిరకాల కోరిక ఈ సినిమాతో నెరవేరబోతున్నందకు ఎంతో ఆనందం వ్యక్తం చేసాడు ప్రబాస్. మరి ఈ సినిమాలో బిగ్‌బీ పాత్రను నాగ్ అశ్విన్ ఎలా డిజైన్ చేసాడో చూడాలి. మొత్తంగా అమితాబ్ ఎంట్రీతో మరోసారి ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండియా సినిమాగా మారింది.
ఇక బిగ్‌బీ అమితాబ్ తెలుగులో నటిస్తోన్న మూడో సినిమా ఇది. ఆయన గతంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘మనం’లో నటించారు. అయితే మనంలో ఆయనది గెస్ట్ రోల్ మాత్రమే. ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో పూర్తి నిడివి ఉన్న పాత్రలో అమితాబ్ అలరించారు.
ఇక తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో అత్యంత భారీగా దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో వస్తోన్న ఈ సినిమాతో అమితాబ్ మరోసారి తెలుగువారిని పలకరించనున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటీ చిత్రంలో సహజంగానే విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Aswani Dutt, Big B, Bollywood, Deepika Padukone, Nag Ashwin, Prabhas, Prabhas 21, Tollywood, Vyjayanthi Movies