Prabhas - Salaar : ప్రభాస్ ఈ యేడాది హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ మూవీతో భారీ ఫ్లాప్‌ను మూట గట్టుకున్నారు. ఆ సినిమా ఫెయిలైనా ఆ ఇంపాక్ట్ వేరే సినిమాలపై లేదు. ప్రస్తుతం రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్0 దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం (Salaar) సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా (Shruti Haasan) శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా 'ఉగ్రమ్' కన్నడ చిత్రానికి రీమేక్ అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలసిఉంది. ఇక ఈ (Salaar) సినిమాను కేజీయఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ (Salaar) సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్లు మరోటాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసినిమా విషయంలో మరో రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా (Salaar) ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు పోటీ పడుతున్నాయని అంటున్నారు. అందులో భాగంగా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 200 కోట్లకు పైగా ఆఫర్ వచ్చిందట.
ఈ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. పృథ్వీరాజ్ యాక్ట్ చేస్తుండంతో మలయాళంలో ఈ సినిమా రేంజ్ మారిపోవడం ఖాయం అంటున్నారు. అందుకే భారీ పారితోషకంతో పాటు కథ కూడా నచ్చడంతో పృథ్వీరాజ్ కూడా ‘సలార్’ మూవీలో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పారు. తాజాగా సలార్ చిత్ర యూనిట్.. ‘సలార్’ పేరుతో ఓ ట్విట్టర్ హ్యాండిల్‌ను ఏర్పాటు చేసారు. ఇకపై ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇందులో ఇవ్వనున్నట్టు చెప్పారు.
— Salaar (@SalaarTheSaga) May 17, 2022
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ’సలార్’ ఈ చిత్రం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు సముద్రంపై జరిగే ఛేజింగ్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంటున్నారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం సలార్ టీమ్ దాదాపు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్.
ఇక ఈ (Salaar) సినిమా కథ విషయానికి వస్తే.. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారట. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడవ్వడం సినిమా మరింత క్రేజ్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా కేజీయఫ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ఆ సినిమాలో సెంటిమెంట్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ.. ఓ రేంజ్లో ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా అంటే ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు.
ఇక ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా కంప్లటైంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్నారు. హిందీ సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్‌గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూషణ్ కుమార్ (టీ సిరీస్), ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Salaar, Shruti haasan, Tollywood