హోమ్ /వార్తలు /సినిమా /

Salaar : ప్రభాస్ ’సలార్’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ? మరోసారి పండగను నమ్ముకున్న రెబల్ స్టార్..

Salaar : ప్రభాస్ ’సలార్’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. ? మరోసారి పండగను నమ్ముకున్న రెబల్ స్టార్..

ఇందులో గ్యాంగ్ లీడర్‌గా కనిపించబోయే ప్రభాస్‌కు రివేంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ముంబై మాఫియాను కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్‌లో కూడా ముంబై మాఫియా ఉంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా గురించి తాజాగా మరో అప్‌డేట్ కూడా బయటికి వచ్చింది. అందులో ఇండోపాక్ వార్ కూడా కనిపించబోతుంది.

ఇందులో గ్యాంగ్ లీడర్‌గా కనిపించబోయే ప్రభాస్‌కు రివేంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ముంబై మాఫియాను కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్‌లో కూడా ముంబై మాఫియా ఉంటుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా గురించి తాజాగా మరో అప్‌డేట్ కూడా బయటికి వచ్చింది. అందులో ఇండోపాక్ వార్ కూడా కనిపించబోతుంది.

Salaar : ప్రభాస్ ’సలార్’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. అంటే ఔననే అంటున్నాయి.

Salaar : ప్రభాస్సలార్’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. అంటే ఔననే అంటున్నాయి. ఇప్పటికే ‘సలార్’ విడుదల తేది ప్రకటించిన 2022  ఏప్రిల్ 14 న తేదినే యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు. పైగా కేజీఎఫ్ సినిమాను నిర్మిస్తోన్న హోంబలే ప్రొడక్షన్స్.. ప్రశాంత్ నీత్, ప్రభాస్ కాంబినేషన్‌లో ‘సలార్’ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇపుడు సినిమా కోసం కొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే యేడాది విజయ దశమి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అదే పండగ రోజున ఈ సినిమాను దాదాపు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాను పూర్తి చేసారు. ఈ సినిమాను కేజీఎప్ పిక్చరైజ్ చేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో పిక్చరైజ్ చేస్తున్నారు.

ఇప్పటికే సలార్ మూవీ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్టు సమాచారం. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ  సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో శృతి హాసన్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు  ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణీ కపూర్ కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో జగపతి బాబు రాజ్ మన్నార్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..


ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. జాన్ అబ్రహం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ సినిమాలో కన్నడ నటుడు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నయట.

Happy Birthday Suman : చిరంజీవి, బాలయ్యలకు ఆ విధంగా ముచ్చెమటలు పట్టించిన సుమన్..

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ .. ‘సలార్’ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ ను రూ. 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట.బాలీవుడ్ బడా హీరోల సినిమాలకు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రేటు ప్రకటించలేదు. కానీ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. అందుకే ఇంత మొత్తంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ ఆఫర్ గురించి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్’లో పక్కా లోకల్ అంటూ ఐటెం పాటతో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా.

ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..

ప్రభాస్ ‘సలార్’ మూవీతో పాటు సమాంతరంగా హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ  ఖాన్ లంకేషుడైన రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు.  మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో‘ప్రాజెక్ట్ K’ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.  మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాను జవనరి 14న సంక్రాంతి కానుగా విడుదల చేస్తున్నారు.

First published:

Tags: Adipurush movie, Prabhas, Prashanth Neel, Salaar, Tollywood

ఉత్తమ కథలు