news18-telugu
Updated: August 30, 2020, 11:56 AM IST
ప్రభాస్ (Instagram/Photo)
Prabhas | ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్‌కు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే.. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రఫ్పాడించింది. అంతేకాదు తెలుగులో పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకొచ్చిన ఈ చిత్రం హిందీలో మాత్రం రూ. 200 కోట్లకు పైగా కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో చూపించింది. మొత్తంగా హిందీతో కలిపి సాహో చిత్రం రూ. 400 కోట్ల వరకు వసూళ్లును రాబట్టింది. అంతేకాదు.. ’సాహో’ చిత్రం తెలుగులో ప్రీమియర్ కాకపోయినా.. హిందీలో మూడు సార్లు టీవీల్లో ప్రసారమైతే.. మూడు సార్లు అదిరిపోయే టీఆర్పీస్ వచ్చాయి. ఈ చిత్రం విడులైన యేడాది పూర్తైన సందర్భంగా ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు తన డై హార్డ్ ఫ్యాన్స్ తో పాటు సాహో టీమ్ మెంబర్స్ అందరినీ కృతజ్ఞతలు తెలిపాడు.
ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రం ..హాలీవుడ్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రేరణగా తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమా చూస్తుంటే.. ఓ హాలీవుడ్ రేంజ్ సినిమా అనిపించేలా ఉంది. హీరోగా ప్రభాస్ రేంజ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం రెబల్ స్టార్.. ‘రాధే శ్యామ్’ తో పాటు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసాడు. దాంతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘
ఆదిపురుష్’ అనే సినిమా అనౌన్స్ చేసాడు. ఈ చిత్రంలో ప్రభాస్.. శ్రీరామచంద్రుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉండనే ఉంది. మొత్తంగా సాహో తర్వాత హీరోగా ప్రభాస్ రేంజ్ కూడా పూర్తిగా మారిపోయింది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 30, 2020, 11:56 AM IST