హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కు U/A సర్టిఫికేట్.. రన్ టైమ్ ఎంతంటే..

Prabhas - Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కు U/A సర్టిఫికేట్.. రన్ టైమ్ ఎంతంటే..

రాదే శ్యామ్ (Radhe Shyam Photo : Twitter)

రాదే శ్యామ్ (Radhe Shyam Photo : Twitter)

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసారు.

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన ‘రాధేశ్యామ్’ రెండో ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ మూవీ విడుదలకు 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ సహా చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.  ఈ సినిమాలో విక్రమ్  విక్రమాదిత్య అనే హస్త సాముద్రికుడి పాత్రలో నటించారు. భవిష్యత్తు తెలిసే అతీంద్రియ శక్తులున్న వ్యక్తి పాత్ర అని ప్రమోషన్‌లో భాగంగా చెప్పారు.

ప్రభాస్ .. ‘రాధే శ్యామ్’ విషయానికొస్తే..  ఈ సినిమాలో  ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే విషయం ట్రైలర్‌తో  చెప్పారు.  తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉంది.

‘రాధే శ్యామ్’‌కు U/A సెన్సార్ సర్టిఫికేట్ (Twitter/Photo)

ఇక ఈ సినిమాలో విజువల్ వండర్  అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్.. మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్ర యువకుడి పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలయ్యే థియేటర్స్‌లో  జ్యోతిష్కులతో ఒక అస్ట్రాలజీ చెప్పే కౌంటర్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఫ్రీగా జ్యోతిషం చెప్పుంచుకోవచ్చు. ఇప్పటికే ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్ జ్యోతిషం చెప్పించుకున్నారు. ఈ సినిమాలో వివిధ దేశాధినేతలు, ప్రధానులకు, వివిధ ప్రముఖులకు జ్యోతిషం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో ఒదిగిపోయారు ప్రభాస్. 

RRR : విడుదలకు ముందు ఆర్ఆర్ఆర్ మూవీపై మరో వివాదం.. సెన్సార్ బోర్డ్, సీఎంలకు నోటీసులు ఇస్తాం అంటూ..


ఇక ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ ఖతర్నాక్ షిప్ సీక్వెన్స్ ఉందట. అంతేకాదు హాలీవుడ్ మూవీ టైటానిక్ సినిమాలో ఎండింగ్ ఎలా ఉంటుందో.. దాదాపుగా ఆ రేంజ్‌లో ఉంటుందని, అంతేకాదు అసలు టైటానిక్ క్లైమాక్స్‌ను మించి రాధేశ్యామ్ క్లైమాక్స్ ఉండబోతుందని అంటున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు.

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ సహా సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరోల కూతుళ్లు..


హిందీలో అమితాబ్ బచ్చన్, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం గాత్ర దానం చేసారు.పైగా దేశంలో హిందీ చిత్ర పరిశ్రమకు గుండె కాయ వంటి ముంబైలో కరోనా కేసులో తగ్గడంతో 100 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్‌ రన్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇవ్వడం ఇపుడు ప్యాన్ ఇండియా మూవీ అయిన ‘రాధే శ్యామ్‌’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ మిగతా హిందీ చిత్రాలకు కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. మొత్తంగా  మార్చి 11న విడుదల కానున్న ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.

First published:

Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

ఉత్తమ కథలు