Prabhas | ప్రభాస్‌కు అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా.. మిగతా హీరోలు కూడా దిగదుడుపే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాల కథనం ప్రకారం.. వివరాల్లోకి వెళితే.. దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసినా.. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీతో హోల్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్.. లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది.
తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నఈ సినిమా నార్త్‌లో మాత్రం ఇరగదీసింది. మొత్తంగా బాహుబలి సినిమాతో ప్రభాస్.. ఆల్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ సినిమా తర్వాత సాహో సినిమాకు దాదాపు నిర్మాణంలో వాటి పాటు రెమ్యూనరేషన్ కలిపి దాదాపు రూ.75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొని అందరినీ ఆశ్యర్యపరిచారు.
సినిమాల్లో ప్రభాస్ తీసుకునే ఈ రెమ్యునరేషన్ పక్కనపెడితే.. ప్రభాస్‌కు పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాతగా పెద్ద నాన్న కృష్ణంరాజుతో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై పలు హిట్ చిత్రాలను నిర్మించారు. అంతేకాదు కృష్ణంరాజుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. ప్రభాస్ నాన్న తెలుగు రాష్ట్రాల్లో పాటు చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాలను కొన్నారు. అంతేకాదు వాళ్లకు ఒక గ్రానైటు ఫ్యాక్టరీ ఉంది. వీటితో పాటు వ్యవసాయ ఆధారిత పొలాలు, కొబ్బరి తోటలు, వివిధ నగరాల్లో ఫామ్‌హౌస్‌లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయట. ఇక ప్రభాస్ స్థిర, చర ఆస్తులు కలపి దాదాపు రూ. 7 వేల కోట్లకు పైగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే తెలుగుల ఇండస్ట్రీలో ఇంత ఆస్తులున్న హీరో మరెవరు లేకపోవచ్చు. సో.. ప్రభాస్.. వెండితెరపై కాదు.. ఆస్తుల్లో కూడా నిజంగానే బాహుబలి అనే చెప్పొచ్చు.
ప్రభాస్ విషయానికొస్తే.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న ‘రాధే శ్యామ్’ మూవీ కోసం కూడా దాదాపు అంతే లెవల్లో పుచ్చుకున్నట్టు టాక్. రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రెబల్ స్ార్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్.. శ్రీ రామచంద్రుడి పాత్రలో అలరించనున్నారు. ఇప్పటికే ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక అశ్వినీదత్ వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో పాటు నాని, విజయ్ దేవరకొండ కూడా నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న సినీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adipurush movie, Bollywood news, Prabhas, Project K, Radhe Shyam, Salaar, Tollywood