హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam 5 WW Days Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 5 డేస్ కలెక్షన్స్.. ఇంత కంటే దారుణం మరోకటి ఉండదు..

Radhe Shyam 5 WW Days Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 5 డేస్ కలెక్షన్స్.. ఇంత కంటే దారుణం మరోకటి ఉండదు..

‘రాధే శ్యామ్’ 8 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

‘రాధే శ్యామ్’ 8 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

Radhe Shyam 5 Day World Wide Collections : ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. నాలుగో రోజు అయినా సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్‌లో దారుణమైన డ్రాప్స్ కనపడుతున్నాయి. ఐదో రోజు ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇంకా చదవండి ...

    Radhe Shyam 5 Day World Wide Collections : ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు అక్కడ కేవలం రూ. 2.4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రెండో రోజు మాత్రం రూ. 2.05 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఓవరాల్‌గా నాలుగు రోజుల్లో రూ. 8 కోట్ల షేర్ సాధించింి.  ఒక రకంగా ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌కు ఇదే పెద్ద దెబ్బ అనే చెప్పాలి.   మరోవైపు మిగిలిన రాష్ట్రాలలో సైతం ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ అయితే రాలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రికార్డు కూడా క్రియేట్ చేయలేకపోయింది రాధే శ్యామ్.

    ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడలేదని ఈ సినిమా వసూళ్లతో అర్థమవుతుంది. ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి.. రెండో రోజు తెలంగాణ, ఆంధ్ర  ప్రదేశ్‌లో రూ. 12.32 కోట్లు షేర్ మాత్రమే వసూళు చేసింది. మూడో  రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.58 కోట్లు.. నాలుగో రోజు.. దారుణంగా పడిపోయి.. కేవలం రూ. 2.11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఐదో రోజు.. రూ. 1.14 కోట్లు మాత్రమే వచ్చింది. ఓవరాల్‌గా ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 51. 64 కోట్లు (రూ. 80.45 కోట్ల గ్రాస్) వసూళ్లు వచ్చాయి.  వసూళు చేసింది. హిందీ, ఓవర్సీస్ సహా మిగిలిన అన్ని ఏరియాల్లో కలిపి ఐదో రోజుల్లో  మొత్తంగా రూ. 25.56  కోట్లు మాత్రమే వసూళ్లును దక్కించుకుంది. మొత్తంగా ఐదో రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    RRR : ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టేసినా తెలంగాణ హైకోర్టు..

    నైజాం (తెలంగాణ): రూ. 23.79 కోట్లు / రూ. 36.50 కోట్లు

    సీడెడ్ (రాయలసీమ): రూ. 7.10 కోట్లు / రూ . 18 కోట్లు

    ఉత్తరాంధ్ర: రూ. 4.58 కోట్లు  / రూ. 13 కోట్లు

    ఈస్ట్: రూ. 4.11కోట్లు / రూ. 8.80 కోట్లు

    వెస్ట్: రూ. 3.17 కోట్లు / రూ. 7.50 కోట్లు

    గుంటూరు: రూ. 4.30 కోట్లు / రూ. 9.90 కోట్లు

    కృష్ణా: రూ. 2.54 కోట్లు / రూ. 7.50 కోట్లు

    నెల్లూరు: రూ. 2.05 కోట్లు / రూ. 4 కోట్లు

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 51.64 కోట్లు / రూ.  105.20 కోట్లు

    కర్ణాటక: రూ. 4.15 కోట్లు / రూ. 12.50 కోట్లు

    తమిళనాడు: రూ. 0.71 కోట్లు /  రూ. 6 కోట్లు

    కేరళ: 0.16 కోట్లు / రూ. 2.10 కోట్లు

    హిందీ: రూ. 8.00 కోట్లు / రూ. 50 కోట్లు

    రెస్టాఫ్ ఇండియా: రూ. 1.52 కోట్లు /  రూ. 3 కోట్లు

    ఓవర్సీస్ : రూ. 11.02 కోట్లు / రూ. 24 కోట్లు

    ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 77.20 కోట్లు (97.70) / రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

    Chiranjeevi - Salman Khan God Father : సల్మాన్‌ఖాన్‌కు చిరంజీవి గ్రాండ్ వెల్కమ్.. గాడ్ ఫాదర్ షూటింగ్‌లో సల్లూ భాయ్..

    ఐదు రోజుల కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ నష్టాలు తప్పేలా కనపడటం లేదు.  ఈ  ఫ్లో చూస్తుంటే.. ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్‌లో ఈ సినిమా నిలవవచ్చు. పెట్టిన పెట్టుబడికి పావు వంతు మాత్రమే రికవరీ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీలో ఇంకా రూ. 42 కోట్ల టార్గెట్‌ను రీచ్ కావాలి.‘సాహో’ విషయానికొస్తే.. ఈ సినిమాకు తెలుగులో కంటే హిందీ బెల్ట్‌లో ఓ ఊపు ఊపింది. అలాంటి రాధే శ్యామ్ విషయానికొచ్చే వరకు అంతా తలకిందులైంది.   మొత్తంగా ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ పరుగు సోమవారం నుంచి దారుణంగా పడిపోయిందనే చెప్పాలి. మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింి.  ఒక రకంగా బాహుబలితో వచ్చిన ఇమేజ్‌‘రాధే శ్యామ్’ మూవీకి ప్రభాస్‌కు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

    ఉత్తమ కథలు