హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas -Project K : రెబల్ స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

Prabhas -Project K : రెబల్ స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

ప్రభాస్ (Twitter/Photo)

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas -Project K :  రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో  తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ K’(Project K) . ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాపై మరో క్రేజీ అప్‌డేట్ వైరల్ ‌గా మారింది.

ఇంకా చదవండి ...

Prabhas -Project K :  రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో  తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ K’(Project K) . ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ట్రయల్ షూట్ కూడా నిర్వహించారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కరోనా విజృంభనతో ఈ సినిమా షెడ్యూల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఎంత వీలైతే అంత త్వరగా సెప్టెంబర్ వరకు  ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అది బాహుబలి 2 విడుదల తేది అయిన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.

మన దేశంలోనే  అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే బల్క్ డేట్స్ కేటాయించారు. ఈ  సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మరో విషయం ఏమంటే.. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాట్లు పూర్తి చేసారు.

Unstoppable with NBK : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో మరో రికార్డు.. మన దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో..


ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే..’రాధే శ్యామ్’ విషయానికొస్తే.. ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి  తప్పుకుంది. జనవరి 14న రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

NBK - Narasimha Naidu : బాలయ్య ఇండస్ట్రీ హిట్ ‘నరసింహనాయుడు’కు 21 యేళ్లు పూర్తి.. సాధించిన రికార్డులు ఇవే..


యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ప్రభాస్ సినిమాలకు కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

RajaShekar : మోహన్ బాబుతో ఆ కారణంగానే ఆ బ్లాక్ బస్టర్ మూవీ చేయలేదన్న రాజశేఖర్.. ఆలీతో టాక్ షోలో యాంగ్రీ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు..


ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నాడు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది.  సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం.

ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా..

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది.  ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి పిక్చరైజ్ చేశారు.

First published:

Tags: Adipurush movie, Bollywood news, Prabhas, Project K, Radhe Shyam, Salaar, Tollywood

ఉత్తమ కథలు