హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ‘రాధే శ్యామ్’ టీజర్‌‌తో పాటు విడుదలకు ముహూర్తం ఖరారు..

Prabhas: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ‘రాధే శ్యామ్’ టీజర్‌‌తో పాటు విడుదలకు ముహూర్తం ఖరారు..

‘రాధేశ్యామ్’’లో ప్రభాస్ (Twitter/Photo)

‘రాధేశ్యామ్’’లో ప్రభాస్ (Twitter/Photo)

Prabhas Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ‘రాధే శ్యామ్’ టీజర్‌‌తో పాటు విడుదలకు ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి ప్రభాస్ సన్నిహిత వర్గాలు.

Prabhas Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ‘రాధే శ్యామ్’ టీజర్‌‌తో పాటు విడుదలకు ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి ప్రభాస్ సన్నిహిత వర్గాలు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమా రిలీజ్ డేట్స్‌ల జాతర నడుస్తోంది. ఒక్కొక్కరుగా విడుదల తేదీలు ప్రకటించేసారు. సమ్మర్‌లో రిలీజ్ అయ్యే ఆచార్య నుంచి దసరాకు విడుదలయ్యే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్లు ప్రకటించారు. అంతేనా.. రీసెంట్‌గా షూటింగ్ మొదలు పెట్టిన ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ డేట్‌ను వచ్చే సంక్రాంతికి ఇపుడు లాక్ చేసేసారు. బాలయ్య, పవన్, వెంకటేష్, అల్లు అర్జున్, రవితేజ, ఒకరా ఇద్దరా అందరూ హీరోలు విడుదల తేదిలు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఎపుడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డేకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలతో టీజర్‌‌ను రెడీ చేసినట్టు సమాచారం. ఈ టీజర్ ఓ రేంజ్‌లో ఉన్నట్టు సమాచారం. ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేయాలి కాబట్టి.. ఫిబ్రవరి 14న టీజర్‌ను విడుదల చేస్తూ.. విడుదల తేదిని కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు ’రాధే శ్యామ్’  మూవీ యూనిట్.

Prabhas, Radhe Shyam, prabha span india movie radhe shyam, director radha krishna kumar, krishnam raju, gopi krishna movies, uv creations, pooja hegde, radhe shyam release date, prabhas movie release date, prabhas movie latest update, ప్రభాస్‌, రాధేశ్యామ్‌, రాధేశ్యామ్‌ రిలీజ్‌ డేట్‌
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ (Twitter/Photo)

ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ డేట్‌ ఏప్రిల్ 28న  రిలీజ్ చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారు. దాదాపు అదే డేట్ లాక్ అయ్యే అవకాశాలున్నాయి.రాధే శ్యామ్ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని దాదాపు  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, శ్యామ్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాను రాధాకృష్ణ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

ప్రభాస్ రాధే శ్యామ్ పోస్టర్ (Prabhas Radhe Shyam movie)
రాధే శ్యామ్:

మరోవైపు ప్రభాస్.. సలార్’తో పాటు ‘ఆదిపురుష్’ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్.. సైన్స్ ఫిక్షన్ మూవీలకు కమిటైయ్యాడు. రీసెంట్‌గా ఫిబ్రవరి 2న  ఆదిపురుష్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో పాటు సలార్ యూనిట్ ప్రయాణిస్తోన్న వెహికల్‌కు ప్రమాదం జరిగింది. దీంతో ప్రభాస్ ఇంట్లో వాళ్లు శాంతి పూజలు చేయించే పనిలో ఉన్నట్టు సమాచారం. ఏమైనా రాధే శ్యామ్ విషయంలో ప్రభాస్ ఓ నిర్ణయానికి వచ్చిసినట్టు తెలుస్తోంది.

First published:

Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood, UV Creations

ఉత్తమ కథలు