REBEL STAR PRABHAS PLANNING TO BUY A HOUSE IN MUMBAI WITH 50 CRORE BUDGET PK
Prabhas: ముంబైకు మకాం మార్చేస్తున్న ప్రభాస్.. అక్కడే భారీ పెట్టుబడి..?
ప్రభాస్ (File/Photo)
Prabhas: పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఇకపై ప్రభాస్ తెలుగు హీరో కాదు. బాహుబలితోనే ఈయన బాలీవుడ్ హీరో అయిపోయాడు. అప్పుడే పాన్ ఇండియన్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. సాహోతో అది గాలివాటం కాదని..
పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఇకపై ప్రభాస్ తెలుగు హీరో కాదు. బాహుబలితోనే ఈయన బాలీవుడ్ హీరో అయిపోయాడు. అప్పుడే పాన్ ఇండియన్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. సాహోతో అది గాలివాటం కాదని నిరూపించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా.. హిందీలో 150 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు వరసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. దర్శకులు కూడా ఈయన కోసం పాన్ ఇండియన్ కథలు సిద్ధం చేస్తున్నారు. కేవలం తెలుగు దర్శకులకు మాత్రమే కాకుండా.. అన్ని భాషల్లో ఉన్న దర్శకులకు కూడా ఈయన అవకాశాలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్తో సలార్ సినిమా చేస్తున్నాడు. కెజియఫ్ లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత ఈయన నుంచి వస్తున్న సినిమా ఇది. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ పాన్ ఇండియన్ సబ్జెక్ట్ అన్నీ ప్రభాస్ రేంజ్ పెంచేస్తున్నాయి. అంతేకాదు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు ప్రభాస్. ఇండియాలో 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరో కూడా ఈయనే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇకపై తెలుగు హీరోగా ఉండటానికి ప్రభాస్ ఏ మాత్రం యిష్టపడటం లేదు. అందుకే తన సామ్రాజ్యం బాలీవుడ్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు రెబల్ స్టార్.
ప్రభాస్ (Twitter/Photo)
అలా జరగాలంటే అక్కడే ఉండాలి. ఇకపై ఇదే చేయబోతున్నాడు ప్రభాస్. కొన్ని నెలల పాటు ముంబైలోనే ఉండిపోవాలని చూస్తున్నాడు ఈయన. ఆదిపురుష్ షూటింగ్ అంతా ముంబైలోనే జరగనుంది. అక్కడే ఓ భారీ స్టూడియోలో సెట్ వేసి పూర్తి చేయనున్నాడు దర్శకుడు ఓం రౌత్. దాంతో పాటు సలార్ సబ్జెక్ట్ కూడా కాస్త ముంబైలో జరగనుంది. అందుకే అక్కడ భారీ పెట్టుబడి పెట్టబోతున్నాడు ప్రభాస్.
ప్రభాస్ ఫైల్ ఫోటో (Prabhas/Twitter)
ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్కు ఈ ఇంటి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఓ ఖరీదైన ప్రాంతంలో పెద్ద ఇల్లు కొనుక్కోవాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం 50 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమాకు వచ్చే పారితోషకంలో చాలా వరకు ఇంటి మీదే పెట్టేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ప్రభాస్ మాత్రం కేరాఫ్ బాంబే అయిపోతున్నాడనేది మాత్రం కాదనలేని సత్యం.