REBEL STAR PRABHAS FANS INCREASING PRESSURE ON RADHE SHYAM RELEASE DATE TA
Prabhas: ప్రభాస్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఇంకెపుడు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం..
ప్రభాస్ (File/Photo)
Prabhas: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమా రిలీజ్ డేట్స్‌ల జాతర నడుస్తోంది. ఒక్కొక్కరుగా విడుదల తేదీలు ప్రకటించేసారు. దీంతో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ విడుదల ఎపుడు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
Prabhas: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమా రిలీజ్ డేట్స్‌ల జాతర నడుస్తోంది. ఒక్కొక్కరుగా విడుదల తేదీలు ప్రకటించేసారు. సమ్మర్లో రిలీజ్ అయ్యే ఆచార్య నుంచి దసరాకు విడుదలయ్యే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్లు ప్రకటించారు. అంతేనా.. రీసెంట్గా షూటింగ్ మొదలు పెట్టిన ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ డేట్‌ను వచ్చే సంక్రాంతికి ఇపుడు లాక్ చేసేసారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఎపుడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డేకు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్.. రాధే శ్యామ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయమంటూ యూవీ క్రియేషన్స్ వాళ్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పటికే సమ్మర్లో ఆచార్యను మే 13న విడుదల తేదిని ప్రకటింంచారు. మరోవైపు వకీల్ సాబ్ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ చివరి వారంలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ డేట్ ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారు. దాదాపు అదే డేట్ లాక్ అయ్యే అవకాశాలున్నాయి.
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ (Twitter/Photo)
రాధే శ్యామ్ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, శ్యామ్ పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాను రాధాకృష్ణ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.