హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas fan suicide: ‘రాధే శ్యామ్’ బాగోలేదని మనస్తాపంతో ప్రభాస్ అభిమాని ఆత్మహత్య..

Prabhas fan suicide: ‘రాధే శ్యామ్’ బాగోలేదని మనస్తాపంతో ప్రభాస్ అభిమాని ఆత్మహత్య..

రాధే శ్యామ్ (Twitter/Photo)

రాధే శ్యామ్ (Twitter/Photo)

Prabhas fan suicide: ఎవరు వీళ్లు.. ఇలా ఉన్నారు.. ఫ్యాన్స్.. మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి.. డై హార్డ్ ఫ్యాన్స్.. ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సాహో (Saaho) సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది. అప్పట్లో ఇది బాగా పాపులర్ అయింది కూడా.

ఇంకా చదవండి ...

ఎవరు వీళ్లు.. ఇలా ఉన్నారు.. ఫ్యాన్స్.. మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నారేంటి.. డై హార్డ్ ఫ్యాన్స్.. ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సాహో (Saaho) సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది. అప్పట్లో ఇది బాగా పాపులర్ అయింది కూడా. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఇలా ఉంటారా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందని.. ఓ అభిమాని (Fan suicide) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. చిన్న చిన్న వాటికి సూసైడ్ ఒక్కటే పరిష్కారం అన్నట్లు మారిపోతున్నారు యువత. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. మొన్న మార్చ్ 11న విడుదలైన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుంది అంటున్నారు.. మరికొందరు బాగోలేదని చెప్పారు. అయితే సినిమాను సినిమాలాగే చూడాలి కానీ పర్సనల్‌గా తీసుకోకూడదు. కానీ ఇప్పుడు ఓ ఫ్యాన్ మాత్రం అదే చేసాడు.

తన అభిమాన హీరో సినిమా బాగోలేదని ఓ కుర్రాడు నిండు జీవితాన్ని బలి చేసుకున్నాడు. క‌ర్నూలులో ఉండే ర‌వితేజ (Ravi Teja) అనే కుర్రాడు తీసకున్న ఈ పిచ్చి నిర్ణయంతో ఆయన కుటుంబమంతా ఇప్పుడు శోక సాగ‌రంలో మునిగిపోయింది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం పర్లేదు అనిపిస్తుంది కానీ సూపర్ అని ఎవరూ చెప్పట్లేదు.

Paruchuri Venkateswara Rao: ‘పరుచూరి’ వెంకటేశ్వర రావుకు ఏమైంది.. ఇలా అయిపోయారేంటి..?


నెగిటివ్ టాక్ వచ్చిందనే విషయాన్నే భరించ‌లేక కర్నూలు తిలక్ నగర్‌లో ఉండే 24 ఏళ్ల ర‌వితేజ అనే యువ‌కుడు బ‌ల‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. త‌ల్లితో చెప్పి మ‌రీ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహ‌త్య చేసుకున్నాడు ఈ కుర్రాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ధర్యాప్తు చేస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఇలా ప్రాణాలు తీసుకునేంత అభిమానం ఉండకూడదు. దాని వల్ల కుటుంబాలు ఇలా ఏడుపుల్లో మునిగిపోతాయి. ఈ మధ్యే భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు సినిమా టికెట్‌కు తండ్రి డబ్బులివ్వలేదని ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Prabhas, Radhe Shyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు