హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. దాని కోసమేనా.. ?

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. దాని కోసమేనా.. ?

Prabhas |  రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి ప్రభాస్ సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే..

Prabhas |  రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి ప్రభాస్ సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే..

Prabhas |  రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి ప్రభాస్ సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే..

  Prabhas |  రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి ప్రభాస్ సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల రెండో తేదిన ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో ముంబ‌యి  ఓ ఫిల్మ్ స్టూడియోలో ‘ఆదిపురుష్’ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. పూజా కార్యక్రమాలతో  లాంఛనంగా ప్రారంభం అయిన ఈ సినిమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అదే రోజు  సాయంత్రం గం.4. గంటల స‌మ‌యంలో స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దీనికి కారణంగా ముహూర్త బలం సరిగా లేనందనే ఇలాంటి ఘటన సంభవించిందని చెబుతున్నారు. ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాంటి  రోజున ఈ సినిమాను ప్రారంభోత్సవం చేసినందుకే ఈ సినిమాకు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు.

  అందుకే మన హీరోలు ఏదైనా సినిమా ప్రారంభించే ముందు ముహూర్తాలు గట్రా చూసుకుంటారు. పైకి ఇదేదో కనబడ్డ.. సినిమా అంటే కోట్లలో జరిగే వ్యవహారం కాబట్టి.. ముహూర్తాలు మిగతా విషయాలపై హీరోలకు, నిర్మాతలు, దర్శకులకు ఇలాంటి  పట్టింపులు చాలానే  ఉంటాయి.

  ప్రభాస్ ఆదిపురుష్ ముహూర్తం షాట్ (Instagram/Photo)

  ప్రస్తుతం గురు మూఢమి ఉన్నందున ఎలాంటి శుభకార్యాలు చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేది నుంచి శుక్ర మూఢమి ఉంది. ఇది ఏప్రిల్ 30వ తేది వరకు ఉంది. ఇలాంటి సందర్భాల్లో మన దగ్గర వివాహాది, గృహ ప్రవేశాలు, పుణ్యకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదని పండితుల వాదన. ఆదిపురుష్‌కు నిర్ణయించిన ముహూర్తం రోజున మంగళవారం కుజుడుకు సంబంధించినది కాబట్టి.. సెట్ అగ్నికి ఆహుతి అయిందని కొంత మంది పండితులు  చెబుుతున్నారు. మరోవైపు మూవీ మేకర్స్ .. ఈ సినిమా నిర్మాణ విషయంలో మరోసారి మంచి ముహూర్తం చూసుకొని తిరిగి మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

  prabhas,prabhas twitter,prabhas instagram,prabhas adipurush movie,prabhas adipurush movie shooting,prabhas adipurush movie shooting fire accident,prabhas adipurush movie shooting in mumbai,prabhas adipurush movie shooting sets fire accident,telugu cinema,ఆదిపురుష్,ప్రభాస్ ఆదిపురుష్,ప్రభాస్ ఆదిపురుష్ సెట్స్‌లో అగ్నిప్రమాదం
  ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident in Adipurush sets)

  మరోవైపు సలార్ విషయంలో కూడా అదే జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా ప్రభాస్ కూడా ఇపుడు సినిమాల ముహూర్తలా విషయంలో జాగ్రత్త ఉండాలని పెదనాన్న కృష్ణంరాజు సూచించినట్టు తెలుస్తోంది. వరుసగా ఇలాంటి ఘటనలు సంభవించడంతో ప్రభాస్ ఇంట్లో దీని కోసం ప్రత్యేకంగా శాంతి పూజలు చేయించినట్టు సమాచారం. కొంత మంది పండితులు సమక్షంలో ప్రత్యేకంగా దోష పరిహార పూజలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు పనిలో పనిగా ప్రభాస్ పెళ్లి కోసము కూడా కొన్ని శాంతులు కూడా చేయించినట్టు సమాచారం. ప్రభాస్ కూడా స్వయంగా ఈ పూజలో పాల్గొన్నట్టు సమాచారం.

  Prabhas Big Uncle Reber Star Krishnam Raju will Play importent role in Adipurush,prabhas,Prabhas krishnam raju,krishnam raju play dasharadha,krishnam raju play dasharatha prabhas twitter,prabhas adipurush movie,adipurush prabhas kiara advani,adipurush prabhas anushka sharama,adipurush anushka sharma as seetha,anushka sharma,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్ కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్‌లో అనుష్క శర్మ,అనుష్క శర్మ,ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ,కృష్ణంరాజు,ప్రభాస్ కృష్ణంరాజు,దశరథుడి పాత్రలో కృష్ణంరాజు
  పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Twitter/Photo)

  ఆదిపురుష్ సినిమా విషయానికొస్తే..  ప్ర‌భాస్ ప్రభు శ్రీరామ్ పాత్ర పోషిస్తున్నారు.   ఆయ‌న త‌ల్లి కౌసల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. మరోవైపు దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటించనున్నారని తెలుస్తోంది ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు రూ.  300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది.

  First published:

  Tags: Adipurush movie, Bollywood news, Prabhas, Radhe Shyam, Salaar, Tollywood

  ఉత్తమ కథలు