Prabhas- Faria Abdullah: జాతిరత్నాలు హీరోయిన్‌పై ప్రభాస్ కామెంట్లు

ప్రభాస్ ఫరియా అబ్దుల్లా

Prabhas- Faria Abdullah: న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం జాతి ర‌త్నాలు. పిట్ట‌గోడ ఫేమ్ అనుదీప్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మార్చి 11న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ని రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు

 • Share this:
  Prabhas- Faria Abdullah: న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం జాతి ర‌త్నాలు. పిట్ట‌గోడ ఫేమ్ అనుదీప్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మార్చి 11న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ని రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. ముంబ‌యిలో ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఆది పురుష్ షూటింగ్‌లో ఉండ‌టంతో.. అక్క‌డ‌కు జాతి ర‌త్నాలు టీమ్ వెళ్లింది. న‌వీన్, ప్రియ‌ద‌ర్శి, హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా, అనుదీప్ న‌లుగురు ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డి నుంచి స్టార్ట్ అవ్వ‌డం మొద‌లు ప్ర‌భాస్‌ని క‌లిసే వ‌ర‌కు ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఫ‌న్నీ ఫ‌న్నీగా వ‌చ్చిన ఆ వీడియో అంద‌రి చేత న‌వ్వులు పూయిస్తోంది.

  ఇక్క‌డి నుంచి ఆ న‌లుగురు ముంబ‌యి వెళ్ల‌డం, అక్క‌డ హోట‌ల్‌లో స్టే చేస్తూ ప్ర‌భాస్ ఇంటికి వెళ్ల‌డం, అక్కడ వాచ్ మెన్ వారిని ఆపడం, అనుదీప్ నేరుగా లోపలికి వెళ్లడం,  ప్ర‌భాస్ వ‌చ్చే వ‌ర‌కు న‌వీన్, ప్రియ‌ద‌ర్శి ఫ‌న్ చేయ‌డం చూపించారు. ఇక ఈ మూవీ హీరోయిన్‌ని చూసిన ప్ర‌భాస్ ఈవిడ ఏంటి ఇంత హైట్ ఉంది..? నిజ‌మేనా.. లేక హీల్స్ వేసుకుందా అని ప్ర‌భాస్ అడిగాడు. ఆ త‌రువాత ఫ్లాట్‌లే వేసుకుంద‌ని, ఇండ‌స్ట్రీలో టాలెస్ట్ హీరోయిన్‌గా డెబ్యూ చేస్తుంద‌ని న‌వీన్ చెప్పాడు. వెంట‌నే ప్ర‌భాస్ రికార్డులు ఏమైనా వ‌చ్చాయా హైట్‌కి అని ఫన్నీ క్వ‌శ్చ‌న్ వేశాడు.


  ఇదిలా ఉంటే ఫుల్ ఫ‌న్నీగా జాతి ర‌త్నాలు ట్రైల‌ర్ వ‌చ్చేసింది. న‌వీన్, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ చేసే హంగామాను ట్రైల‌ర్‌లో చూపించ‌గా.. సినిమా మొత్తం న‌వ్వుల‌తో ఉండ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే న‌వీన్ ఇప్ప‌టికే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ఆ మూవీలో్ కాస్త సీరియ‌ల్ పాత్ర‌లో క‌నిపించిన న‌వీన్ ఈ మూవీలో ఫుల్ కామెడీ చేయ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్‌ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉండ‌నుందో తెలియాలంటే మ‌రో ఏడు రోజులు ఆగాల్సిందే.
  Published by:Manjula S
  First published: