news18-telugu
Updated: October 21, 2020, 8:15 AM IST
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీ (Twitter/Photo)
Prabhas Birthday Common DP | రెబల్ స్టార్ ప్రభాస్... ఈ పేరు వింటే చాలు.. ఆరడుగుల అందగాడు కళ్లముందు కదులుతాడు. తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఏక్ నిరంజన్‌లా దూసుకుపోతున్న మిస్టర్ పర్ఫెక్ట్. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఛత్రపతి. మాస్ ప్రేక్షకులకు రెబల్. క్లాస్ ఆడియన్స్‌కు డార్లింగ్. బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వెండితెర పై సామో అనిపిస్తోన్న బాహుబలి. ప్రస్తుతం ఇతను టాలీవుడ్ స్టార్ కాదు. ఇండియన్ స్టార్. ఈ నెల 23న ప్రభాస్ 41వ యేట అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన బర్త్ డే కామన్ డీపీని సోషల్ మీడియాలో లాంఛ్ చేసారు.

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీ (Twitter/Photo)
ఇందులో బాహుబలిని పోలిన సాహో లుక్‌తో ఉన్న బర్త్ డే కామన్ డీపీ ఆకట్టుకునేలా ఉంది. కింద ఇండియన్ సినిమా అని రాసి ఉంది. అంటే ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసినట్టు కనపడుతోంది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు.

రాధే శ్యామ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే
మరోవైపు వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా కాదు కాదు.. ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తోంది. మరవైపు బాలీవుడ్ షెహెన్షా.. అమితాబ్ బచ్చన్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.ఇంకోవైపు ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించడమే కాదు.. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు.ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్.. లంకేషుడైన రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కామన్ డీపీ (Twitter/Photo)
మరోవైపు అజయ్ దేవ్‌గణ్.. మహా శివుడి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు ఈ చిత్రంలో ప్రభాస్.. పెదనాన్న కృష్ణంరాజు.. శ్రీరాముడి తండ్రైన దశరథుడి పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు ఈ సినిమాలో సీతగా పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనకు వచ్చాయి.

ప్రభాస్ ఆదిపురుష్Photo : Twitter
అందులో అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్, కృతి సనన్ అంటూ పూటకో పేరు వినబడుతోంది. ఫైనల్‌గా ఈ సినిమాలో సీతగా ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది చూడాలి. మొత్తంగా ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశాలున్నాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 21, 2020, 8:15 AM IST