హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas : ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు..

Prabhas : ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు..

ప్రభాస్ (Facebook/Photo)

ప్రభాస్ (Facebook/Photo)

Prabhas : ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Prabhas : ప్రభాస్ దూకుడు మాములుగా లేదుగా.. రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్.. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రాన్ని ఎపుడు చేసారో హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. అంతేకాదు బాహుబలితో బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డులను తన వశం చేసుకున్నారు. ఆ తర్వాత ‘సాహో’ తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసారు. ఈ చిత్రం బ్యాడ్ టాక్‌తో కూడా కళ్లు చెదరే వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్టు అఫీసియల్‌గా ప్రకటించారు.

ప్రస్తుతం ప్రభాస్ సినిమాల కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువైన ఫస్ట్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోగా రికార్డులకు ఎక్కాడు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో ఓ రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్..ఇపుడు మరో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నారు.

Nuvvu Naaku Nachav@20Years: 20 యేళ్ల వెంకటేష్ కల్ట్ కామెడీ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’.. ఫైనల్ కలెక్షన్స్..

తాజాగా ప్రభాస్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ ఫాలోవర్స్  చేరుకున్నారు. రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ప్రభాస్.. తాజాగా 7 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ చేసారు. ఇక ప్రభాస్.. ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 24 మిలియన్స్ దాటింది. దక్షిణాదిలో ఈ ఫీట్ అందుకున్న తొలి హీరోగా రికార్డులకు ఎక్కారు. మరోవైపు దేశ వ్యాప్తంగా టాప్ 10లో 9వ స్థానంలో నిలిచారు ప్రభాస్. ఫేస్‌బుక్ 50 మిలియన్ ఫాలోవర్స్‌తో సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఆ జాబితాలో రెండు, మూడు, నాల్గో స్థానంలో ఉన్నారు.

Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

మరోవైపు ప్రభాస్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ‘రాధే శ్యామ్’ తర్వాత..  ‘సలార్’ సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ 30 శాతం కంప్లీటైంది. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం కంప్లీట్ అయింది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్స్‌కు చాలా ఎక్కువ సమయం తీసుకోనుంది.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..


అందుకే  ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ఆ తర్వాత సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాతో పాటు సుధ కొంగర దర్శకత్వంలో మరో  సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.

First published:

Tags: Adipurush movie, Bollywood news, Prabhas, Radhe Shyam, Salaar, Tollywood

ఉత్తమ కథలు