హోమ్ /వార్తలు /సినిమా /

Deepika Padukone : దీపికా పదుకొణేకు రెబల్ స్టార్ ప్రభాస్ స్ఫెషల్ బర్త్ డే విషెస్..

Deepika Padukone : దీపికా పదుకొణేకు రెబల్ స్టార్ ప్రభాస్ స్ఫెషల్ బర్త్ డే విషెస్..

దీపికాకు ప్రభాస్ బర్త్ డే విషెస్ (Twitter/Photo)

దీపికాకు ప్రభాస్ బర్త్ డే విషెస్ (Twitter/Photo)

Prabhas - Nag Ashwin : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఈ రోజు 35వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ ..దీపికాకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు.

Prabhas - Nag Ashwin : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఈ రోజు 35వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. దీపికా పదుకొణే విషయానికొస్తే.. ఈ పేరును  తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతలా ఆమె తన నటనతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ ఏర్పరుచుకున్నారు. పెళ్లైన తర్వాత తన భర్తతో కలిసి నటించిన ‘83’ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలైంది. మంచి టాక్ వచ్చినా.. అందుకు తగ్గ కలెక్షన్లు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈమె ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రంతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకోంటోన్న దీపికా పదుకొణేకు ప్రభాస్ పుట్టినరోజు బెస్ట్ విషెస్ అందజేశారు.

మరోవైపు ప్రభాస్, దీపికా పదుకొణేలతో  సినిమాను నిర్మిస్తోన్న వైజయంతీ మూవీస్ కూడా దీపికాకు స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రభాస్, దీపికా పదుకొణే హీరో, హీరోయిన్లుగా  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి  ‘ప్రాజెక్ట్ K’ పేరు పెట్టారు.  ఇప్పటికే  రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ట్రయల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్ కాకుండా మరో ఇద్దరు స్టార్ హీరోలు నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఓమైక్రాన్ మూలంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త విడుదల తేది ఎపుడనేది త్వరలో ప్రకటించనున్నారు.

Chiranjeevi : కూతురు సుస్మిత మూవీని చూసి మెచ్చుకున్న చిరంజీవి..


దీంతో పాటు  ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు.  ఈ చిత్రంలో ప్రభాస్.. మర్యాద పురుషోత్తముడు శ్రీ రామచంద్రుడి పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాలన్ని ఈ యేడాదే విడుదల కానున్నాయి.

First published:

Tags: Bollywood news, Deepika Padukone, Prabhas, Tollywood, Vyjayanthi Movies

ఉత్తమ కథలు