హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas: ’ఆదిపురుష్’ సినిమా కోసం ప్రభాస్, దర్శకుడు ఓంరౌత్ ప్రత్యేక శాంతి పూజలు..?

Prabhas: ’ఆదిపురుష్’ సినిమా కోసం ప్రభాస్, దర్శకుడు ఓంరౌత్ ప్రత్యేక శాంతి పూజలు..?

Prabhas  - Adipurush |  ఏ ముహూర్తానా.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ ఈ సినిమాను మొదలు పెట్టారా అప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది.

Prabhas  - Adipurush |  ఏ ముహూర్తానా.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ ఈ సినిమాను మొదలు పెట్టారా అప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది.

Prabhas  - Adipurush |  ఏ ముహూర్తానా.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ ఈ సినిమాను మొదలు పెట్టారా అప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది.

    Prabhas  - Adipurush |  ఏ ముహూర్తానా.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ ఈ సినిమాను మొదలు పెట్టారా అప్పటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఫిబ్రవరి 2వ తేదిన ముంబాయి ఫిల్మ్ స్టూడియోలో పూజా కార్యక్రమాల తర్వాత అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో సినిమా కోసం వేసిన సెట్లు కాలి బూడిద అయ్యాయి. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్.. ఈ సినిమాలో రాముడి పాత్ర కంటే రావణుడి పాత్ర అద్భుతంగా అని చెప్పడం పై కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత ముంబైలో షూటింగ్ చేద్దామంటే అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టడంతో ఈ సినిమా కోసం ముందుగా అనుకున్న షెడ్యూల్లు అన్ని క్యాన్సిల్స్ అయ్యాయి.

    ఇలా ఒక దాని వెనక మరొకటి వరుసగా దుస్సంఘటనలు జరుగుతూ ఉండటంతో ప్రభాస్‌ కుటుంబ సభ్యులతో పాటు ఓంరౌత్‌తో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్.. పండితులను సంప్రదించారట. పండితులు.. ఈ సినిమా ముహూర్త బలం సరిగా లేనందనే ఇలాంటి ఘటన సంభవించాయని  చెబుతున్నారు. ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాంటి  రోజున ఈ సినిమాను ప్రారంభోత్సవం చేసినందుకే ఈ సినిమాకు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు.అందుకే మన హీరోలు ఏదైనా సినిమా ప్రారంభించే ముందు ముహూర్తాలు గట్రా చూసుకుంటారు. పైకి ఇదేదో కనబడ్డ.. సినిమా అంటే కోట్లలో జరిగే వ్యవహారం కాబట్టి.. ముహూర్తాలు మిగతా విషయాలపై హీరోలకు, నిర్మాతలు, దర్శకులకు ఇలాంటి  పట్టింపులు చాలానే  ఉంటాయి.

    ఫ్రభాస్ ‘ఆదిపురుష్’ పూజా కార్యక్రమానికి హాజరైన అజయ్ దేవ్‌గణ్ (Instagram/Photo)

    పైగా ప్రభు శ్రీరాముడికి సంబంధించిన రామాయణంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ముందుగా దోష నివారణార్ధం ప్రత్యేక పూజలు చేయాలని సంకల్పించారు. ఇప్పటికే కొంత మంది పండితులు.. ఈ దోష నివారణతో పాటు ‘ఆదిపురుష్’ సినిమా పూర్తైయ్యే వరకు ప్రభాస్.. పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తూ.. ఈ సినిమాను నిష్ఠగా పూర్తిగా చేయాలని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ఏదో ఆషామాషిగా ‘ఆదిపురుష్’ సినిమాను చేస్తామంటే ఈ సినిమాను ఎన్నో అవాంతరాలు ఎదురైతున్నాయి. గురు మూఢమిలో ఈ సినిమాను  ప్రారంభించినందునే ఇలాంటి అపశకునాలు ఎదురైనట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు మూవీ మేకర్స్ .. ఈ సినిమా నిర్మాణ విషయంలో మరోసారి మంచి ముహూర్తం చూసుకొని తిరిగి మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.


    prabhas,prabhas twitter,prabhas instagram,prabhas adipurush movie,prabhas adipurush movie shooting,prabhas adipurush movie shooting fire accident,prabhas adipurush movie shooting in mumbai,prabhas adipurush movie shooting sets fire accident,telugu cinema,ఆదిపురుష్,ప్రభాస్ ఆదిపురుష్,ప్రభాస్ ఆదిపురుష్ సెట్స్‌లో అగ్నిప్రమాదం
    ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా సెట్స్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident in Adipurush sets)

    మరోవైపు సలార్ విషయంలో కూడా అదే జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా ప్రభాస్ కూడా ఇపుడు సినిమాల ముహూర్తలా విషయంలో జాగ్రత్త ఉండాలని పెదనాన్న కృష్ణంరాజు సూచించినట్టు తెలుస్తోంది. వరుసగా ఇలాంటి ఘటనలు సంభవించడంతో ప్రభాస్ ఇంట్లో దీని కోసం ప్రత్యేకంగా శాంతి పూజలు చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. కొంత మంది పండితులు సమక్షంలో ప్రత్యేకంగా దోష పరిహార పూజలు చేస్తున్ . మరోవైపు పనిలో పనిగా ప్రభాస్ పెళ్లి కోసము కూడా కొన్ని శాంతులు కూడా చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్ చిత్ర యూనిట్ ఈ పూజలో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

    Prabhas Big Uncle Reber Star Krishnam Raju will Play importent role in Adipurush,prabhas,Prabhas krishnam raju,krishnam raju play dasharadha,krishnam raju play dasharatha prabhas twitter,prabhas adipurush movie,adipurush prabhas kiara advani,adipurush prabhas anushka sharama,adipurush anushka sharma as seetha,anushka sharma,kiara advani,prabhas adipurush kiara advani,prabhas adipurush movie keerthy suresh,prabhas keerthy suresh,adipurush movie,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ కీర్తి సురేష్,ప్రభాస్ ఆదిపురుష్‌లో కీర్తి సురేష్,ఆదిపురుష్‌లో కియారా అద్వానీ,ఆదిపురుష్‌‌లో సీతగా కియారా అద్వానీ,కియారా అద్వానీ ప్రభాస్,ప్రభాస్‌కు జోడిగా కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్ కియారా అద్వానీ,ప్రభాస్ ఆదిపురుష్‌లో అనుష్క శర్మ,అనుష్క శర్మ,ఆదిపురుష్‌లో సీత పాత్రలో అనుష్క శర్మ,కృష్ణంరాజు,ప్రభాస్ కృష్ణంరాజు,దశరథుడి పాత్రలో కృష్ణంరాజు
    పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Twitter/Photo)

    ఆదిపురుష్ సినిమా విషయానికొస్తే..  ప్ర‌భాస్ ప్రభు శ్రీరామ్ పాత్ర పోషిస్తున్నారు.   ఆయ‌న త‌ల్లి కౌసల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. మరోవైపు దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటించనున్నారని తెలుస్తోంది. మహా శివుడి పాత్రలో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నట్టు సమాచారం.  ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు రూ.  300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది.

    First published:

    Tags: Adipurush, Bollywood news, Kriti Sanon, Om Raut, Prabhas, Tollywood

    ఉత్తమ కథలు