Prabhas 25Th Movie | రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’(Bahubali) సినిమాతో ప్రభాస్ లోకల్ స్టార్ నుంచి ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తోన్నఅన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ సినిమాకు తెలుగులో అంతగా నడవకపోయినా.. నార్త్ రీజియన్‌లో ఇరగదీసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఆ సంగతి పక్కన పెడితే... ప్రభాస్ హీరోగా 25వ సినిమాపై అపుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఈ నెల 7వ తేదిన ప్రకటించనున్నారు. మొత్తంగా ప్రభాస్.. హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ 20వ మూవీ.
ఆ తర్వాత నటిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమా 21వ సినిమా అవుతోంది. ‘సలార్’ 22వ మూవీ అవుతోంది. వీటిలో ఏది ముందుగా రిలీజ్ అవుతుందో చూడాలి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న ’ప్రాజెక్ట్ K’ సినిమా 23వ సినిమా. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేసారు.
24వ సినిమా సిద్ధార్ధ్ ఆనంద్‌తో చేయనున్నట్టు సమాచారం. కానీ 25వ సినిమా మాత్రం ఈ నెల 7న ఏ దర్శకుడితో ఏ బ్యానర్‌లో చేయనున్నరనేది అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ విషయానికి వస్తే.. కరోనా సెకండ్ వేవ్ లెకపోయింటే ‘రాధే శ్యామ్’ జూలై 30న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఉండేది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.