నా ఆరోగ్యం బాగానే ఉంది.. పుకార్లపై స్పందించిన కృష్ణంరాజు
ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని.. పరీక్షలన్నీ పూర్తయ్యాక తిరిగి ఇంటికి వెళ్తానని ఓ ప్రకటన విడుదల చేవారు కృష్ణం రాజు.
news18-telugu
Updated: November 14, 2019, 7:16 PM IST

పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Facebook/Photo)
- News18 Telugu
- Last Updated: November 14, 2019, 7:16 PM IST
కేంద్ర మాజీ మంత్రి, నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. న్యుమోనియా కారణంగా ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తాయని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్వయంగా కృష్ణంరాజు స్పందించారు. తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్కు వెళ్లానని చెప్పారు. కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాశారని.. దాంతో హాస్పిటల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు కృష్ణం రాజు. అభిమానులు కూడా ఆందోళన చెందారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని.. పరీక్షలన్నీ పూర్తయ్యాక తిరిగి ఇంటికి వెళ్తానని ఓ ప్రకటన విడుదల చేవారు కృష్ణం రాజు.
పోలీసులను గన్తో కాల్చబోయారు.. సజ్జనార్ ప్రెస్మీట్..
‘దిశ’ హీరో వీసీ సజ్జనార్ ట్రాక్ రికార్డు ఇదీ..
ఉప్పల్లో నేడు టీ20 మ్యాచ్.. అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు
దిశ హత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యం.. పాతిపెట్టిన దాన్ని బయటకు తీసి...
దిశ కేసు విచారణకు 50 మంది పోలీసులు...
హైదరాబాద్లో దారుణం... భర్తను సజీవదహనం చేసిన భార్య...
Loading...