ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ పై పెదనాన్న కృష్ణంరాజు క్లారిటీ..

ప్రభాస్, కృష్ణం రాజు

 • Share this:
  ‘బాహుబలి’ అనే సినిమాతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఈ సినిమాతో ప్రభాస్‌ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ ఇచ్చిన క్రేజ్‌తో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సాహో’తో ప్రభాస్ దేశ వ్యాప్తంగా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాడా అని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెదనాన్న రెబల్ కృష్ణంరాజు.. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. పెదనాన్న బాటలోనే ప్రభాస్.. బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడా . అంతేకాదు ప్రభాస్ రాజకీయాల్లోకి తీసుకురావడమే మీ టార్గెటా  అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

  rebel star krishnam raju clarifies about prabhas political entry here are the details,krishnam raju,krishnam raju movies,prabhas,krishnam raju clarity about prabhas political entry,prabhas political entry,prabhas bjp,saaho pre release event,young rebel star prabhas,prabhash krishnam raju wife shyamala devi,prabhas about krishnam raju,rebel star krishnam raju,krishnam raju daughters,veteran actor krishnam raju interview,krishnam raju about prabhas,prabhas,krishnam raju wife shyamala devi about prabhas,prabhas and krishnam raju,is krishnam raju,krishnam raj dialogues,prabhas and krishnam raju fun moments,prabhas about his uncle krishnam raju,tollywood,bollywood,కృష్ణంరాజు,ప్రభాస్,ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ పై కృష్ణంరాజు క్లారిటీ,ప్రభాస్ రాజకీయాలు,సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్,సాహో,ప్రభాస్ సాహో,ప్రభాస్ రాజకీయాలు,ప్రభాస్ బీజేపీ,ప్రభాస్ రాజకీయ ఎంట్రీ పై కృష్ణంరాజు,
  పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ (Facebook/Photo)


  ప్రస్తుతం ప్రభాస్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన హీరో కాదు. ఒక రకంగా భారతదేశానికి పరిమితం అయితే ఇంకో రకం. కానీ ఇపుడు ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అందుకే ప్రభాష్ రాజకీయాల్లోకి వస్తాడా ? రాడా ? అనేది ఇపుడు నిర్ణయించడం సమంజసం కాదన్నారు. గతంలో బాహుబలి సినిమా సక్సెస్ తర్వాత కృష్ణంరాజు తన వెంట ప్రభాస్‌ను తీసుకెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే  ప్రభాస్ రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నారనే మాట పొలిటికల్ సర్కిల్స్‌లో వినబడింది.  అంతేకాదు త్వరలోనే కమలం తీర్ధం పుచ్చుకోనున్నారనే టాక్ వినబడింది.  పీఎం నరేంద్ర మోదీతో ప్రభాస్ (Facebook/Photo)
  ప్రభాస్ బీజేపీ చేరతారనే విషయాలపై స్పందిస్తూ.. బాహుబలి సినిమాను అప్పట్లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ చూశారు. మోదీగారితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అప్పట్లో మేమందరం పార్టీ విషయాలను చర్చించుకునే వాళ్లం. వారు నాకు ఎంతో దగ్గర కాబట్టి..నేను ప్రభాస్‌ను వాళ్లకు పరిచయం చేసాను. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. మొత్తానికి రాజకీయాలపై నేను ప్రభాస్ పై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో ప్రభాస్‌కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
  First published: