హోమ్ /వార్తలు /సినిమా /

రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం: టీజర్ విడుదల చేసిన హను రాఘవపూడి

రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం: టీజర్ విడుదల చేసిన హను రాఘవపూడి

Rebals of Tupakulagudem (Photo News 18)

Rebals of Tupakulagudem (Photo News 18)

Rebals Of Tupakulagudem Teaser: వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే.. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. కొత్త తరహా సినిమాలను ఆదరిస్తున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం (Rebals Of Tupakulagudem) అనే కొత్త చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు (Jaideep Vishnu) దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. మణిశర్మ (Manisharma) బాణీలు కడుతున్నారు. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మొత్తం నలభై మంది కొత్త నటీనటులతో ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. శరవేగంగా అన్ని పనులు పూర్తి చేస్తున్న యూనిట్.. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) రిలీజ్ చేశారు. టీజర్ చూసిన అనంతరం బాగుందని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తి పెంచేసింది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' అంటూ ప్రారంభమైన టీజర్ ఓ ఇంట్రెస్ట్‌ క్రియేట్ చేసింది. 'వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి'.. 'అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది'.. 'ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతాందా?' అనే ఈ డైలాగ్స్‌తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు.' isDesktop="true" id="1519486" youtubeid="pMuh_bGi0YA" category="movies">

అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్‌ను యూనిట్ కట్ చేసింది. ఈ టీజర్‌లో శ్రీకాంత్ అర్పుల కెమెరాపనితనం అద్భుతంగా కనిపిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జైదీప్ విష్ణు దర్శకుడు కూడా కావడంతో ఎక్కడ ఎలాంటి కట్స్ కావాలి..ఏ ఏ షాట్స్ ఉండాల్లో తెలుసు. కాబట్టి ఎడిటర్‌గానూ అద్భుతంగా ఈ టీజర్‌ను కట్ చేశారు జై దీప్ విష్ణు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానుంది.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood Cinema

ఉత్తమ కథలు