హోమ్ /వార్తలు /సినిమా /

అక్కినేని అవార్డు వేడుకలో సమంత ఎక్కడ... కారణం అదేనా..

అక్కినేని అవార్డు వేడుకలో సమంత ఎక్కడ... కారణం అదేనా..

నాగార్జున సమంత నాగ చైతన్య (Samantha Naga Chaitanya)

నాగార్జున సమంత నాగ చైతన్య (Samantha Naga Chaitanya)

అక్కినేని నాగేశ్వర్ రావు జాతీయ పురాస్కారాల ప్రదానోత్సవం నిన్న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరిగింది.

లెజెండరీ నటుడు, ఒకప్పటి తెలుగు నెంబర్‌వన్ హీరో.. అక్కినేని నాగేశ్వర్ రావు జాతీయ పురాస్కారాల ప్రదానోత్సవం నిన్న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరిగింది. ప్రతి యేటా ఈ అవార్డులను సినీ రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు అందజేస్తున్నారు. అందులో భాగంగా  2018 ఏడాదికి గానూ దివంగత నటి శ్రీదేవి, 2019 ఏడాదికి గానూ ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులు, దర్శకలు, నిర్మాతలు హాజరై సందడి చేశారు. నాగేశ్వర రావు కుటుంబానికి చెందిన మూడు తరాల వారసులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, నాగచైతన్య భార్య సమంత మాత్రం ఆ వేడుకలో కనిపించలేదు. అక్కినేని కుటుంబానికి సంబందించి ఫ్యామిలీ మెంబర్స్  పాల్గొన్న ఈ వేడుకలో అందాల సమంత కనిపించకపోవడం కొంత లోటుగా కనపడింది.

సమంత ప్రస్తుతం 96 అనే తమిళ రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ను ముగించుకుంది. ఈ నేపథ్యంలో సమంత హాజరుకాకపోవడానికి గల కారణం అర్థం కాలేదు ఆమె అభిమానులకు. అయితే సమంత అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. బహుశా ఆ షూటింగ్‌లో  ఉండి రాలేకపోయిందా.. అని అనుకుంటున్నారు ఆమె అభిమానులు.









View this post on Instagram





✈️ 🍳


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on



సోనాల్ చౌహాన్ అదిరే అందాలు..

First published:

Tags: Samantha akkineni, Telugu Movie News

ఉత్తమ కథలు