Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 14, 2018, 1:46 PM IST
త్రివిక్రమ్ దేవీ శ్రీ ప్రసాద్
తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు, సంగీత దర్శకుల మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. వాళ్లు కలిసి పని చేస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. అలాంటి జోడీ త్రివిక్రమ్, దేవీ శ్రీ ప్రసాద్. "జల్సా" నుంచి వీళ్ల ప్రయాణం మొదలైంది. ఆ సినిమా తర్వాత "అత్తారింటికి దారేది", "జులాయి", "సన్నాఫ్ సత్యమూర్తి" సినిమాలకు కలిసి పని చేసారు. ఇక త్రివిక్రమ్ అంటే దేవీ ఉండాల్సిందే అని అంతా ఫిక్స్ అయిపోయారు. అలాంటి టైమ్‌లో ఏమైందో తెలియదు కానీ "అ..ఆ" నుంచి దేవీ మారిపోయాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్
ఆ సినిమా నుంచి ఆయనతో కలిసి పని చేయడం లేదు దేవీ, త్రివిక్రమ్. "సన్నాఫ్ సత్యమూర్తి" టైమ్‌లో ఏదో గొడవ అయిందని అందుకే ఇద్దరూ విడిపోయారనే టాక్ వచ్చింది. ఈ ఇష్యూపై మాట్లాడటానికి అటు దేవీ కానీ.. ఇటు త్రివిక్రమ్ కానీ ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు దీనిపై స్పందించాడు త్రివిక్రమ్. "అరవింద సమేత" ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. తన సినిమాలకు ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ పని చేసారని.. అయితే ఇప్పుడు అతడితో పని చేయకపోవడానికి ప్రత్యేకంగా కారణాలు ఏమీ లేవని తెలిపాడు.

త్రివిక్రమ్ దేవీ శ్రీ ప్రసాద్
తమ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని అనవసరంగా అంతా అనుకుంటున్నారని.. అలాంటివి అస్సలే లేవని.. ఇప్పటికీ తనతో దేవీ మాట్లాడుతూనే ఉన్నాడని చెప్పాడు త్రివిక్రమ్. "అ ఆ" సినిమాకు బడ్జెట్ తక్కువ.. అందుకే దేవిశ్రీ ప్రసాద్‌ని తీసుకోలేదు.. అతన్ని తీసుకుంటే రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది.. అందుకే తీసుకోలేదు దానికి మించి కారణాలు లేవని చెప్పాడు. ఇక తనకు కూడా మిగిలిన సంగీత దర్శకులతో పని చేయాలని ఉందని అందుకే తమన్‌ను తీసుకున్నానని చెప్పాడు.

దేవీ శ్రీ ప్రసాద్
"అరవింద సమేత"కు తను ఊహించిన దానికంటే తమన్ ఎక్కువ సంగీతం అందించాడని.. తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు మాటల మాంత్రికుడు. ఇద్దరి వ్యక్తుల మధ్య స్వేచ్ఛగా పని జరగాలంటే వారి మధ్య గొడవ జరగాల్సిన అవసరం లేదు.. దేవీ, తనకు మధ్య ఇప్పటికీ మంచి అండర్ స్టాండింగ్ ఉందన్నాడు త్రివిక్రమ్. అయితే ఎప్పుడు కలిసి పని చేస్తారనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేసాడు ఈయన. మరి చూడాలిక.. ఎప్పటికి కలిసి పని చేస్తారో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
October 14, 2018, 1:46 PM IST