బాలయ్యకి బోయపాటి వార్నింగ్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్..

బోయపాటి శ్రీను బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ సినిమాలంటేనే యాక్షన్‌కి కేరాఫ్ అడ్రస్. ఈ యాక్షన్ హీరోకి బోయపాటి తోడైతే.. అంతే వూరమాస్ లానే ఉంటుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు బాలయ్య.. బోయపాటి..

  • Share this:
సింహా, లెజెండ్ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్స్ మూవీస్.. కొన్ని ఫెయిల్యూర్ మూవీస్ అనంతరం వచ్చిన సింహా.. రికార్డులని బద్దలు కొట్టింది. ఈ సినిమాతో బాలయ్య కుర్రహీరోలకు పోటీనిచ్చాడనే చెప్పాలి. అటూ ఈ మూవీ డైరెక్టర్ బోయపాటికి సింహా మంచి పేరునే తీసుకొచ్చింది. సింహా తర్వాత మరికొంత గ్యాప్ తీసుకుని మళ్లీ లెజెండ్ మూవీ చేశారు ఈ ఇద్దరూ.. ఇది కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో.. ఇద్దరు మళ్లీ కలిసి మూవీస్ చేయలేదు.. గౌతమిపుత్ర శాతకర్ణి, పైసావసూల్ వంటి సినిమాల్లో బాలయ్య నటించగా.. బోయపాటి కూడా జయజానకి నాయక మూవీని రిలీజ్ చేశారు. అనంతరం ఎన్నో అంచనాల నడుమ రిలీజైన్ వినయ విధేయ రామ బోల్తా కొట్టింది. ఇటూ బాలకృష్ణ ఎన్టీఆర్ మూవీస్ కూడా నిరాశపరిచాయి. దీంతో.. మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేయాలని చూస్తున్నారు.

అనుకున్న విధంగానే బోయపాటి బాలకృష్ణకి కథ వినిపించడం... నందమూరి నటసింహం కూడా ఓకే చెప్పేయడం చకచకా జరిగిపోయాయట. అయితే.. మధ్యలో వినయవిధేయ రామ ఎఫెక్ట్‌తో ఈ సినిమాకి బ్రేక్ పడుతుందని అంతా అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అందుకే ఈ సినిమా గురించిన ఏ న్యూస్ బయటికి రావడం లేదని కూడా చెప్పుకున్నారు.. కానీ అసలు కథ వేరే ఉందని టాలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటంటే..

బాలకృష్ణ, బోయపాటిలు ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. ఆ రెండింటిలోనూ బాలయ్య డ్యూయల్ రోల్.. ఇప్పుడు రాబోయే మూడో సినిమాలోనూ బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ క్యారెక్టర్‌ గురించి బాలకృష్ణ 20 కిలోల బరువుతగ్గాలట.. అదే విధంగా లుక్స్ పరంగా చాలా కేరింగ్ తీసుకోవాలట.. ఇందుకోసం ఆల్రెడీ వర్కవుట్ మొదలైనట్లు.. ఆకారణంగానే ప్రాజెక్ట్ లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. సరికొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ని కనువిందు చేస్తాడు బాలయ్య. అప్పుడు పైసావసూల్ మూవీ కోసం ఫుల్ స్టైలిష్‌గా కనిపించిన బాలయ్య.. అంతకు మించిన స్మార్ట్ లుక్స్‌తో కట్టిపడేస్తాడని చెబుతున్నారు టాలీవుడ్ జనాలు.. మరీ ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయకతప్పదు..
First published: