Home /News /movies /

REASON BEHIND YSRCP MLA ACTRESS ROJA SELVAMANI SILENCE ON MAA ELECTIONS AK

Roja: ‘మా’ రచ్చపై రోజా మౌనం.. వెనుకలా ఇంత కథ దాగి ఉందా ?

మంచు విష్ణు, రోజా, ప్రకాశ్ రాజ్

మంచు విష్ణు, రోజా, ప్రకాశ్ రాజ్

Roja on MAA Elections 2021: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత రోజా చాలా మారిపోయారు. ప్రత్యర్థులను తనదైన శైలిలో టార్గెట్ చేయడం... ఎటువంటి పరిణామాలపైనైనా మాట్లాడటం రోజా ప్రత్యేకత. అలాంటి రోజా మా ఎన్నికల పరిణామాలపై పెద్దగా మాట్లాడలేదు.

ఇంకా చదవండి ...
    ‘మా’ ఎన్నికలు ముగిసిపోయాయి. ప్రచారంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగింది. చివరకు ఎన్నికల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక మా ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చాలామందికి అర్థంకాని విషయం ఒకటి ఉంది. అదే నటి రోజా మౌనం. ఎన్నికల్లో పాల్గొని ఓటేసిన రోజా... మా ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రం చాలా తక్కువగా మాట్లాడారు. నిజానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత రోజా చాలా మారిపోయారు. ప్రత్యర్థులను తనదైన శైలిలో టార్గెట్ చేయడం... ఎటువంటి పరిణామాలపైనైనా మాట్లాడటం రోజా ప్రత్యేకత. అలాంటి రోజా మా ఎన్నికల అంశంపై మాత్రం పెద్దగా మాట్లాడలేదనే చెప్పాలి.

    రోజా తలుచుకుంటే మా ఎన్నికల పరిణామాలపై స్పందించి ఇరు పక్షాల వారికి క్లాస్ తీసుకునేవాళ్లు. కానీ ఆమె అలా చేయలేదు. సైలెంట్‌గా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటేసి.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వారికి ఓటేస్తానని చెప్పి వెళ్లిపోయారు. ఆమె ఎవరికి ఓటు వేయబోతున్నారనే అంశంపై కూడా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అయితే ఆమె మంచు విష్ణు ప్యానల్‌కు ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

    వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితులైన విష్ణు విజయాన్ని రోజా కోరుకున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు రోజా ఈ ఎన్నికలపై మాట్లాడకపోవడానికి మరో కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. తాను పొరపాటున ఏదో ప్యానల్‌కు అనుకూలంగా మాట్లాడినట్టు జరిగితే.. ఏపీలోని అధికార వైసీపీ ఆ ప్యానల్‌కు మద్దతుగా ఉన్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతుందని.. అప్పుడు మా ఎన్నికలకు ఏపీ రాజకీయాలకు ముడిపెట్టినట్టు అవుతుందని రోజా భావించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

    Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

    మా ఎన్నికల పరిణామాలపై రోజా మాట్లాడకపోవడానికి ఇదే అసలైన కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న రోజా.. మా ఎన్నికల పరిణామాలపై మౌనంగా ఉండటం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఆమెకే తెలియాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: MAA Elections, Rk roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు