Home /News /movies /

REASON BEHIND VARSHA IMMANUEL LOVE STORY IN JABARDASTH COMEDY SHOW AK

Jabardasth: Varsha, Immanuel లవ్ స్టోరీ..తెర వెనుక అసలు కథ ఇదే..

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్  (jabardasth emmanuel varsha)

జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ (jabardasth emmanuel varsha)

Jabardasth: జబర్ధస్త్‌లో తనదైన పంచ్‌లతో ఇమ్మాన్యుయేల్ దూసుకుపోతున్నాడు. అటు జబర్ధస్త్‌తో పాటు ఇటు ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.

    జబర్ధస్త్‌లో కొత్త కొత్త లవ్ స్టోరీలు పుట్టుకురావడం ఆడియెన్స్‌లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జబర్ధస్త్ యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య సాగుతున్న లవ్ స్టోరీ.. బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం జబర్ధస్త్‌లో కనిపిస్తున్న వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య కొత్త లవ్ స్టోరీ మొదలైందనేలా సంకేతాలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. అంతకుముందు ఈ ఇద్దరు కలిసి చేసిన కొన్ని స్కిట్స్‌కు వ్యూస్ బాగా వచ్చాయి. ఓ వైపు ఇమ్మాన్యుయేల్‌పై సెటైర్లు వేస్తూనే.. అతడికి జోడిగా నటిస్తూ వస్తోంది వర్ష. ఇమ్మాన్యుయేల్ చాలా మంచోడంటూ కామెంట్ చేసి.. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనేలా హింట్ ఇచ్చింది.

    ఈ ఇద్దరి మాటలు వింటుంటే.. వీరి మధ్య లవ్ స్టోరీ ఎపిసోడ్‌.. ముందు ముందు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే తెరపై వర్ష, ఇమ్మాన్యుయేల్ చేసే వ్యాఖ్యలు నిజమేనా.. వాళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా.. అనే అంశాన్ని పక్కనపెడితే.. అసలు వీరి మధ్య కొత్త లవ్ స్టోరీ మొదలుకావడానికి అసలు కారణం సుధీర్, రష్మీ అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. జబర్ధస్త్‌లో సుధీర్, రష్మీ లవ్ స్టోరీ ఎఫ్పుడూ హాట్ టాపికే. ఇది జబర్ధస్త్ క్రేజ్ పెరగడానికి.. వాళ్లిద్దరూ పాపులర్ అవడానికి కూడా ఎంతగానో కలిసొచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో వీరి మధ్య లవ్ స్టోరీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం లేదనే అభిప్రాయానికి వచ్చిన జబర్ధస్త్ నిర్వాహకులు.. షోపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు వర్ష, ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ స్టోరీని క్రియేట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    జబర్ధస్త్‌లో తనదైన పంచ్‌లతో ఇమ్మాన్యుయేల్ దూసుకుపోతున్నాడు. అటు జబర్ధస్త్‌తో పాటు ఇటు ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ లవ్ స్టోరీ క్రియేట్ చేయడం ద్వారా... షోను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చవచ్చని జబర్ధస్త్ నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి.. సుధీర్, రష్మీ మధ్య వర్కవుట్ అవుతున్న రేంజ్‌లో వర్ష్, ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jabardasth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు