Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    రోజాకు అలా కలిసొచ్చిన పుష్ప.. అసలు కారణం ఇదేనా..

    పుష్ప మూవీలో కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక సహా చాలామంది స్టార్స్ చిత్తూరు యాసను నేర్చుకున్నారని సమాచారం.

    news18-telugu
    Updated: June 3, 2020, 8:36 PM IST
    రోజాకు అలా కలిసొచ్చిన పుష్ప.. అసలు కారణం ఇదేనా..
    పుష్ప సినిమాలో విలన్‌గా రోజా (File/Photos)
    • Share this:
    స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో రోజా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో లేడీ విలన్‌గా రోజా కనిపించనుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే అసలు ఈ సినిమాలో రోజాను తీసుకోవాలనే ఆలోచన సుకుమార్‌కు ఎందుకు వచ్చిందనే దానిపై కూడా టాలీవుడ్‌లో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కీలకమైన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం స్టార్స్ అంతా చిత్తూరు జిల్లా యాసను ప్రాక్టీస్ చేస్తున్నారు.

    హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక సహా చాలామంది స్టార్స్ చిత్తూరు యాసను నేర్చుకున్నారని సమాచారం. ఇక సినిమాలో కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేయాల్సిన నటి కూడా చిత్తూరు యాసలోమాట్లాడాల్సి ఉంటుందని... అందుకు రోజానే కరెక్ట్ అని సుకుమార్ అనుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన రోజాకు చిత్తూరు యాస కొట్టిన పిండి. ఇక ఆమె యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా ఏ విధంగా చూసుకున్నా... పుష్ప సినిమాలో రోజా పాత్ర సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది.
    Published by: Kishore Akkaladevi
    First published: June 3, 2020, 8:27 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading