హోమ్ /వార్తలు /సినిమా /

Exclusive..Bala Krishna - Boyapati Srinu : బాలకృష్ణ 106... హీరోయిన్ మార్పుకు అస‌లు కార‌ణమిదే..!

Exclusive..Bala Krishna - Boyapati Srinu : బాలకృష్ణ 106... హీరోయిన్ మార్పుకు అస‌లు కార‌ణమిదే..!

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ (fFile/Photo)

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ (fFile/Photo)

Bala Krishna - Boyapati Srinu : బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అసలు ముందు ప్రకటించినట్లు హీరోయిన్‌గా సయేషా సైగల్ నటించలేదు.. అందుకు కారణం..

  నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న 106వ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప‌లువురు పేర్లు వినిపించాయి. కానీ చివ‌ర‌కు చిత్ర యూనిట్ స‌యేషా సైగ‌ల్ హీరోయిన్‌గా న‌టించ‌నుందంటూ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఇక సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయిన త‌ర్వాత సీన్ మారిపోయింది. చివ‌ర‌కు ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా రేసులో నిలిచింది. అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన హీరోయిన్ కాకుండా.. మ‌రో హీరోయిన్ ఈ రేసులో ఎలా చేరింది? అనే దానిపై పెద్ద చర్చే జ‌రిగింది. ఫోటో షూట్ చేస్తే స‌యేషా సైగ‌ల్ బాల‌కృష్ణ ప‌క్క‌న సూట్ అవ‌లేద‌ని అందుకనే చివ‌రి నిమిషంలో మ‌రో హీరోయిన్‌ను తీసుకున్నార‌నే వార్త‌లు కూడా వినిపించాయి.

  కానీ.. అస‌లు ఇదే... కానీ బాల‌కృష్ణ బోయపాటి శ్రీను మూడో సినిమాలో హీరోయిన్ మార్పుకు అస‌లు కార‌ణం క‌రోనా వైర‌స్ అని టాక్‌. స‌యేషా సైగ‌ల్ కంటే ముందే ప్ర‌గ్యా జైశ్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. తీరా షూటింగ్‌కు వెళ‌దామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌గ్యాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె రెండు వారాలు పాటు అందుబాటులో ఉండ‌న‌ని చెప్పింది. ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంది. ఇంకా ఆల‌స్యం చేస్తే బాగోద‌ని భావించిన నిర్మాత‌లు స‌యేషా సైగ‌ల్‌ను సంప్ర‌దించారు. ఆమె ఒప్పుకుంది. చివ‌ర‌కు ఆమెకు కూడా క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏం చేయాలో తెలియ‌క ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఈలోపు రెండు వారాల పుణ్యకాలం కాస్త గ‌డిచిపోవడంతో చివ‌ర‌కు ప్రగ్యా జైశ్వాల్‌కే వాళ్లు ఓటు వేయాల్సి వ‌చ్చింది. ఇది బాల‌య్య సినిమాలో హీరోయిన్ మార్పుకు అస‌లు కార‌ణం. ప్రగ్యా జైశ్వాల్‌తో పాటు పూర్ణ నటిస్తోన్నప్పటికీ ఆమె హీరోయిన్ పాత్రలో కాకుండా కీలక పాత్రలో నటిస్తుంది.

  బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో వీరిద్ద‌రూ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. అలాగే ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని.. అందులో ఓ పాత్ర అఘోరా పాత్రట‌. గ‌త రెండు చిత్రాల‌కు భిన్నంగా బోయపాటి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ని బాల‌య్య ఇది వ‌ర‌కే ప‌లు సంద‌ర్భాల్లో తెలియ‌జేశారు.

  Published by:Anil
  First published:

  Tags: Bala Krishna, Bala Krishna Nandamuri, Boyapati Srinu, NBK 106, Pragya jaiswal

  ఉత్తమ కథలు