Home /News /movies /

REASON BEHIND NANDAMURI BALAKRISHNA AGREES TO DO A TALK SHOW AK

Nandamuri Balakrishna: బాలకృష్ణలో ఈ మార్పు ఏంటి ?.. ట్రెండ్‌ ఫాలో అవుతున్నారా ?

బాలకృష్ణ

బాలకృష్ణ

Balakrishna: కేవలం సినిమాల్లో నటించడానికి మాత్రమే పరిమితం కాకుండా.. ఇలాంటి వాటిలోనూ సత్తా చాటాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

    సినిమా మారుతోంది. సినిమా మేకింగ్‌తో పాటు సినిమా బిజినెస్ స్వరూపం కూడా మారుతోంది. ఇందుకు తగ్గట్టుగానే నటులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన స్టార్స్.. ఇప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తున్నారు. టీవీ షోల్లో(Talk Show) తళుక్కుమంటూ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఈ రకంగా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడంతో పాటు ట్రెండ్‌కు తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటున్నారు. ఇందులో కొందరు నటులు ముందుంటే.. మరికొందరు నటులు ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా ఈ జాబితాలో చేరడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

    ప్రముఖ ఓటీటీ ఆహా(Aahaa) లో టెలికాస్ట్ కాబోయే టాక్ షో అన్‌స్టాపబుల్‌లో బాలకృష్ణ యాంకర్‌గా కనిపించబోతున్నారు. టాక్ షోకు బాలకృష్ణ యాంకర్ అనడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. సినీ ప్రియులు సైతం కొత్త క్యారెక్టర్‌లో బాలకృష్ణ ఏ రకంగా మెప్పిస్తారని ఎదురుచూస్తున్నారు. అయితే ఉన్నట్టుండి బాలకృష్ణ టాక్‌ షోలోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలకృష్ణ చాలాకాలం పాటు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

    అయితే ఇప్పుడు ట్రెండ్ మారడంతో.. ట్రెండ్‌కు తగ్గట్టుగా మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. పూర్తిగా టాక్‌ షోలు కాకపోయినా.. ఈ రకమైన షోలను టాలీవుడ్‌లోని అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున సహా మరెందరో నిర్వహించారు. కొందరు ఇప్పటికీ నిర్వహిస్తూనే ఉన్నారు.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    కాబట్టి కేవలం సినిమాల్లో నటించడానికి మాత్రమే పరిమితం కాకుండా.. ఇలాంటి వాటిలోనూ సత్తా చాటాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్‌ జడ్జి రోజా బాలకృష్ణకు ఫోన్ చేయడం.. ఆయన నేను కూడా షోకు జడ్జిగా వస్తానని చెప్పడం ఆసక్తిరేపుతోంది. ఇవన్నీ చూస్తుంటే.. బాలకృష్ణ తనలోని మరో యాంగిల్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారేమో అనిపించకమానదు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Nandamuri balakrishna, Unstoppable NBK

    తదుపరి వార్తలు