హోమ్ /వార్తలు /సినిమా /

మహేశ్‌బాబు ‘మహర్షి’కి తక్కువ హైప్ ? కారణం ఏమిటి ?

మహేశ్‌బాబు ‘మహర్షి’కి తక్కువ హైప్ ? కారణం ఏమిటి ?

మహేష్ బాబు ట్విట్టర్ ఫోటో

మహేష్ బాబు ట్విట్టర్ ఫోటో

Mahesh babu Maharshi Movie : సాధారణంగా సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే హైప్ క్రియేట్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. కానీ మహర్షి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

    టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ ‌బాబు నటిస్తున్న మహర్షి సినిమా వచ్చే నెల్లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి ఆడియో ఫంక్షన్‌కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేశ్ బాబు కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాను చిత్ర నిర్మాతలు భారీ ఎత్తున నిర్మించారు. సరికొత్త కథలను ఎంచుకుని సినిమాలు చేసే దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే కారణమేంటో తెలియదు కానీ... ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్ రావడం లేదని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న పెద్ద హీరో సినిమా మహర్షి ఒక్కటే. అలాంటి సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో ఉండాలి. కానీ మహర్షి విషయంలో మాత్రం అలాంటి హైప్ కనిపించడం లేదు.


    సాధారణంగా సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే హైప్ క్రియేట్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. కానీ మహర్షి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాకు ఎక్కువగా హైప్ ఇవ్వడం వల్ల అంచనాలు పెరిగిపోయి మొదటికే మోసం వస్తోందని భావించిన మూవీ మేకర్లు... కావాలనే తమ సినిమాపై అంచనాలు పెరగకుండా కేర్ తీసుకుంటున్నారని సినీ జనం భావిస్తున్నారు. సినిమా విడుదలకు రెండు వారాల ముందు ప్రమోషన్స్ మొదలుపెడితే చాలు అనే భావనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. సినిమా ఆడియో రిలీజ్ నుంచి మహర్షి ప్రమోషన్స్ మొదలవుతాయని... అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొత్త కొత్త ప్రోమోలను విడుదల చేయాలని మహర్షి మేకర్లు డిసైడయ్యారని తెలుస్తోంది. మొత్తానికి మహేశ్ బాబు మహర్షి ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయి ? సినిమా ఎలా ఉంటుంది ? అని సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    First published:

    Tags: Maharshi, Mahesh babu

    ఉత్తమ కథలు