ఇదీ అసలు కారణం.. యాంకర్ ప్రదీప్ బుల్లితెరకు ఎందుకు దూరమయ్యాడు?

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుండి కొన్ని రోజులుగా బుల్లితెరపై కనిపించడం మానేసాడు. దాంతో ఆయన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అసలు తమ అభిమాన యాంకర్‌కు ఏమైంది అంటూ ఆందోళన పడుతున్నారు.

news18-telugu
Updated: November 1, 2019, 11:58 AM IST
ఇదీ అసలు కారణం.. యాంకర్ ప్రదీప్ బుల్లితెరకు ఎందుకు దూరమయ్యాడు?
యాంకర్ ప్రదీప్ (Source: Twitter)
  • Share this:
బుల్లితెర స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ కొద్దిరోజులుగా టీవీ షోల్లో కనిపించడం లేదు. ఉన్నట్టుండి 'ఢీ' షో నుంచి తప్పుకున్నాడు.
తన సొంత నిర్మాణంలో వస్తున్న 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' అనే షోకి కూడా రావడం లేదు. దీంతో ప్రదీప్‌కి ఏమైంది.. ఏమైపోయాడు అనే చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ప్రదీప్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. అయితే వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రదీప్ సన్నిహితులు ఆయన ఆరోగ్యంపై స్పందించారు.

ప్రస్తుతం ప్రదీప్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఆ షూటింగ్‌ సమయంలో ప్రదీప్ కాలికి గాయమైన కారణంగా.. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు. మరో రెండు వారాల్లో ఆయన బుల్లితెర రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. ప్రదీప్ సన్నిహితులు ఇచ్చిన ఈ సమాచారంతో ఆయన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>