• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • REALLY VANTALAKKA DEEPA CHARECTER COMPLETED IN KARTHIKA DEEPAM TELUGU SERIAL NR

Karthika Deepam: వంటలక్క పాత్ర ముగిసిందా.. రేపటి నుంచి కార్తీకదీపంలో వంటలక్క ఉండదా?

Karthika Deepam: వంటలక్క పాత్ర ముగిసిందా.. రేపటి నుంచి కార్తీకదీపంలో వంటలక్క ఉండదా?

karthika deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ సీరియల్ రోజు రోజుకు మరింత ఉత్కంఠగా మారుతున్నా క్రమంలో బుల్లితెర

  • Share this:

    Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ సీరియల్ రోజు రోజుకు మరింత ఉత్కంఠగా మారుతున్నా క్రమంలో బుల్లితెర ప్రేక్షకులు ఒక్క సెకండ్ కూడా ఈ సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ సీరియల్ ఈరోజుకి 1024 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టగా ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం..


    ఇక కార్తీక్ వాళ్ళ అత్త ఇంట్లో పూజ హడావిడి జరుగుతుంది.. ఇక మోనిత, భారతి దీప వాళ్ల పిన్ని వాళ్ళ ఇంటికి కారులో బయలుదేరారు. ఇక దీప, కార్తీక్ ల గురించి భారతి, మోనిత మాట్లాడుతున్న మాట మధ్యలో దీప కండిషన్ తీవ్రంగా ఉందని భారతి చెప్పడంతో వెంటనే మోనిత తన మనసులో నీ ఇల్లు చల్లగుండ.. చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే అని అనుకుంటుంది. ఇక తను, కార్తీక్ డాక్టర్ అన్న విషయం మర్చిపోకు అంటూ ఇక తన ఆరోగ్యం అంతా తన చేతిలోనే ఉందంటూ ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా.. ఎవరు ఏమి అడిగిన ఈ విషయం బయట పెట్టకు అని భారతితో మోనిత చెబుతుంది.


    ఇక వెంటనే మోనిత మనసులో ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని తెగ సంబర పడిపోతోంది. కానీ నేను వస్తున్నాగా.. తేవాల్సిన మందులు తెస్తున్నానుగా.. అటు నుంచి అటే ఆంబులెన్స్ ఎక్కి ఐసీయూలో చేర్చే ప్లాన్ వేశాను గా అంటూ తెగ నవ్వుకుంటుంది. కారులో మోనిత, భారతి రాగా.. సౌందర్య, దీప గుమ్మం దగ్గర ఉండి చూస్తుంటారు. ఇక దీపం మనసులో కోపం రగులుతుంది. భారతి మనసులో కార్తీక్ కు దీపపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది.


    ఇక మోనిత రాకకు దీపకి మండిపోతుంది. ఇక సౌందర్య, దీప మాట్లాడుకుంటూ లోలోపలే రగిలిపోతూ కూల్ గా ఉన్నట్లు నటిస్తారు. ఇక సౌందర్య దీపను చక్కెర పొంగలి చేయమని చెప్పగా కార్తీక్ భారతిని సౌందర్యకు పరిచయం చేస్తాడు.. అయితే భారతి కూడా మోనిత ఫ్రెండేనా అంటూ కోపంగా చూస్తుంది.


    ఇక దీప చక్కెర పొంగలి పనిలో ఉంటే అక్కడున్న పెద్ద పొయ్యి మంటకు దగ్గుతో ఇబ్బంది పడుతుంది. ఇక పిల్లలు తనను పక్కకు తీసుకొని కూర్చోబెట్టగా.. వెంటనే కార్తీక్ కోపంతో వచ్చి దీప పై అరుస్తాడు. వెంటనే సౌందర్య వచ్చి నేనే చేయమన్నానని అంటుంది. ఇక ఆసమయంలో అక్కడికి వచ్చిన మోనితతో దీపం మొండి చేస్తున్నట్లుగా కార్తీక్ చెప్తుంటే.. వెంటనే మోనిత అదేంటి దీప.. కార్తీక్ వద్దన్న వినవు అన్నట్లు, కార్తీక్ ను గౌరవించడం నేర్చుకో అంటూ కాస్త ఓవర్ మాటలతో దీపం రెచ్చగొడుతుంది. ఇక దీపం వెంటనే మండిపోయి ఓవరాక్షన్ చేస్తున్నావ్ అంటూ నా మొగుడికి నేను గౌరవం ఇవ్వకపోవడం ఏంటే! అని గెస్ట్ గెస్ట్ లా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. ఇది ఇవాళ్టి ఎపిసోడ్.. అయితే దీప రేపటి ఎపిసోడ్ లో పూజలో కూర్చోగా పడిపోతుంది.. ఆస్పత్రిపాలైన తర్వాత వంటలక్క ఉంటుందా? లేక వంటలక్క పాత్ర ముగిసిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

    Published by:Navya Reddy
    First published:

    అగ్ర కథనాలు