వారికి తోడుగా ఉండేవాడే అసలైన మగాడు : అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి..

కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్య ప్రజల నుండి సెలెబ్రీటీస్ వరకు అనేక ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు.

news18-telugu
Updated: April 19, 2020, 1:55 PM IST
వారికి తోడుగా ఉండేవాడే అసలైన మగాడు : అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి..
సందీప్ రెడ్డి Photo : Twitter
  • Share this:
కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో సామాన్య ప్రజల నుండి సెలెబ్రీటీస్ వరకు అనేక ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. సామాన్యలకు పని దొరకపోవడంతో సమయానికి తిండి లేక ఇబ్బందులు పడుతుంటే సెలెబ్రీటీస్ మాత్రం ఇంట్లో పనోళ్లు లేక సతమతమవుతున్నారు. ఇలా ఈ కరోనా అందర్నీ ఇబ్బంది పెడుతోంది. దీని దెబ్బకు చిన్నోడు పెద్దోడు అందరూ అవస్థలు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఇల్లాలుకు తోడుగా ఉండాలనీ చెబుతున్నాడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి. దీనికి సంబందించి ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో సందీప్ గిన్నెలు కడగడం, ఇంటిని శుభ్రం చేయడం.. అద్దాలను తూడ్చడం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ పోస్ట్‌లో సందీప్ రెడ్డి రాస్తూ.. నిజమైన మగాడు తన భార్యను చక్కగా చూసుకుంటాడని.. ఈ కష్టకాలంలో ఇంట్లో పనిచేసేవారు లేనందున ఇంట్లో ఆడవారికి తోడుగా ఉండాలనీ సూచించాడు. అంతేకాదు ఈ విషయాన్ని రాజమౌళి అందరికి చేరవేసేలా చూడాలనీ ఆయన్ను ట్విట్టర్‌లో టాగ్ చేశాడు. ఎవరైతే ఇంట్లో ఆడవారికి వివిధ పనుల్లో సహాయం చేస్తారో వారు ఓ వీడియో కూడా పోస్ట్ చేసి మిగితా వారికి స్పూర్తిని అందించాలనీ కోరాడు.

ఇక సందీప్ రెడ్డి సినిమాల విషయానికి వస్తే తెలుగులో అర్జున్ రెడ్డి తీసి బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హిందీలో అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో తీసి అక్కడ కూడా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆసినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతోన్న ఇంతవరకు ఆయన కొత్త సినిమాకు సంబందించిన ఏ ప్రకటను విడుదల చేయలేదు. ఆ మధ్య రణ్ బీర్ కపూర్‌తో ఓ సినిమా అన్నారు.. తాజాగా అల్లు అర్జున్‌తో ఇంకో సినిమా అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా చేయాల్సిన కొత్త సినిమాపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

First published: April 19, 2020, 1:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading