RX 100తో తెలుగు తెరపై అందాల విందు చేసిన పంజాబ్ బ్యూటీ... పాయల్ రాజ్‌పుత్... RDX లవ్ టీజర్‌లో అంతకు మించి రెచ్చిపోయంది. టీజర్ మొత్తం అందాల ప్రదర్శనలు, హద్దులు మించిన ముద్దులే ఉన్నాయి. వాటికి తోడు... సేఫ్టీ పేరుతో... డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఫుల్లుగా ఉన్నాయి. దాదాపు పెద్దలకు మాత్రమే అనిపించేలా సాగిందీ టీజర్. ప్రధానంగా... తొలి సినిమాతోనే... అందాల విందుకి తోడు... చక్కటి నటనతో ఆకట్టుకున్న పాయల్‌ను... బహుశా ఈ సినిమాలో డైరెక్టర్... స్కిన్ షో కోసమే ఎంపిక చేసుకున్నాడేమో అనిపిస్తోంది ఈ టీజర్ చూస్తుంటే. టీజర్‌ని చూసి సినిమా ఎలా ఉందో చెప్పేసే రోజులు కావివి. ఎందుకంటే ఇప్పుడొస్తున్న చాలా టీజర్లలో విషయం ఒకటుంటే... సినిమాలో మేటర్ వేరే ఉంటోంది మరి.
‘RX 100’ చిత్రంలో తన బోల్డ్ నటనతో కుర్ర హృదయాలను క్లీన్ బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో బుల్ బుల్ బుల్లెట్టు అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు పాయల్‌కు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న RDX లవ్ సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా యూత్‌కి తెగ నచ్చేయడం గ్యారెంటీ. పైగా ఈ సినిమాలో... పాయల్ రాజ్‌పుత్ వెరైటీ డాన్స్‌తో ఆకట్టుకోబోతున్నట్టు సమాచారం. దాని కోసం ఐదారు కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆ డాన్స్ హైలెట్ అని చెబుతున్నారు.
RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ సరసన తేజస్ కంచర్ల నటించాడు. శంకర్ భాను డైరెక్ట్ చేసిన ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Payal Rajput, RDX Love Movie, Telugu Movie News, Tollywood news