Home /News /movies /

RC15 RAM CHARAN SHANKAR COMBO INTERESTING UPDATE SLB

Rc15: ఆ ఒక్క సెట్ కోసమే కోట్లలో ఖర్చు! రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ సీన్ ఆ రేంజ్‌లో ఉండనుందా..?

Ram Charan Photo

Ram Charan Photo

RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న రామ్ చరణ్ కొత్త సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్ గురించిన అప్ డేట్ వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి ...
RRR సినిమాతో విక్టరీ కొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. అదే ఊపులో మరో బిగ్గెస్ట్ మూవీని ఫినిష్ చేస్తున్న సంగతి తెలిసిందే. బడా దర్శకులు శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం వేసిన ఓ భారీ సెట్ గురించిన అప్ డేట్ వైరల్‌గా మారింది.

ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ స్థాయిలో అంచ‌నాలున్నాయి. దీనికి తగ్గట్లుగా ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతున్నారు దర్శకనిర్మాతలు. అయితే రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ సీన్‌ కోసం శంక‌ర్ ఓ పర్ఫెక్ట్ ప్లాన్ చేశారట. ఇందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో దాదాపు 10కోట్లతో ఓ భారీ సెట్‌ నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ సెట్‌లో చ‌ర‌ణ్ ఎంట్రీ సీన్స్ అదుర్స్ అనేలా షూట్ చేయాలని శంకర్ స్కెచ్చేశారట.

ఇకపోతే ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చూడబోతున్నామట. చిత్ర క్లైమాక్స్ పార్ట్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ కోసం శంకర్ ఓ రేంజ్ ప్లాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ 20 నిమిషాలు పాటు ఉండనుందని అంటున్నారు. చిత్రానికి అధికారి అనే టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. సర్కారోడు అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో శంకర్ తన డిసీజన్ మార్చుకొని అధికారి అనే పేరుకు మొగ్గు చూపుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ మూవీపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం మెగా లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.
Published by:Sunil Boddula
First published:

Tags: Ram Charan, RC 15, Shankar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు