Home /News /movies /

RC15 CRAZY UPDATE RAM CHARAN LOOK VIRAL SLB

RC15: రామ్ చరణ్ లుక్ ఇదే.. వీడియో వైరల్

Photo Twitter

Photo Twitter

Ram Charan Shankar: ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా రామ్ చరణ్ శంకర్ కాంబో రూపొందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ లుక్‌ బయటకొచ్చింది. రామ్ చరణ్‌కి మేకప్‌ చేస్తున్న వీడియో క్లిప్‌ ఇది.

ఇటీవలే RRR సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బడా దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో మరో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చెర్రీ సరసన అందాల భామ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానులను హుషారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.

ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో రెండు విభిన్న పాత్రల్లో రామ్ చరణ్ కనిపించనుండటం జనాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు చరణ్ లుక్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని విన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్‌ లుక్‌ బయటకొచ్చింది. రామ్ చరణ్‌కి మేకప్‌ చేస్తున్న వీడియో క్లిప్‌ ఇది. ఇందులో చెర్రీ హాఫ్ లుక్ చూపించారు. దీంతో ఈ లుక్ క్షణాల్లోనే వైరల్ గా మారింది.

గుబురు గడ్డం, కళ్ల జోడుతో సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు రామ్ చరణ్. ఈ వీడియో క్లిప్ చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చరణ్‌ లుక్‌పై అందరిలో ఓ రకమైన ఆసక్తి నెలకొంది. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో తండ్రి.. ఇద్దరు కుమారులుగా చెర్రీ కనిపించనున్నారని టాక్. కాగా ఈ సినిమాకు విశ్వంభర, సర్కారోడు, అధికారి లాంటి టైటిల్స్ పరిశీలనలో పెట్టారని సమాచారం.



ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎలక్షన్ కమీషనర్‌గా రామ్ చరణ్ కనిపించనున్నారట. దీంతో పాటు రెండు డిఫరెంట్ మాస్ షేడ్స్ చూడబోతున్నామట. దిల్ రాజు (Dil Raju) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో ఈ మూవీపై ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ భారీ చిత్రంలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ సినిమాపై మెగా లోకంలో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Ram Charan, Shankar, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు