Home /News /movies /

RC15 CRAZY UPDATE FROM RAM CHARAN SHANKAR MOVIE SLB

RC15: ఆలోచనలో పడ్డ శంకర్.. టైటిల్ ఫిక్స్ చేస్తూ రామ్ చరణ్ కోసం క్రేజీ ఐడియాస్!

Photo Twitter

Photo Twitter

Rc15 Title: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బడా దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానులను హుషారెత్తిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిసింది.

ఇంకా చదవండి ...
దర్శక ధీరుడు రాజమౌళితో (SS Rajamouli) కలిసి RRR రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బడా దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చెర్రీ సరసన అందాల భామ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానులను హుషారెత్తిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం తెలిసింది.

ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకుడు శంకర్. రెండు విభిన్న పాత్రల్లో రామ్ చరణ్ కనిపించనుండటం జనాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు చరణ్ లుక్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండనుందట. RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో తండ్రి.. ఇద్దరు కుమారులుగా చెర్రీ కనిపించనున్నారని టాక్. అయితే ఈ మూవీకి అధికారి (Adhikari) అనే ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ అనుకుంటున్నారని విన్నాం.

కానీ ఇది మెగా అభిమానులకు అంతగా రుచించడం లేదనే టాక్ వచ్చింది. కథ ప్రకారం ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని శంకర్ భావిస్తుండగా.. మెగా అభిమానులు మాత్రం ఇది కాస్త ఓల్డ్‌గా అనిపిస్తోందని, ఈ జెనరేషన్‌లో ఇలాంటి టైటిల్ ఎవ్వరికీ పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చని చెప్పుకుంటున్నారట. ఈ క్రమంలో అధికారి అనే టైటిల్‌తో పాటు ఓ పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ యాడ్ చేస్తూ ఈ టైటిల్ పోస్టర్ వదలాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు కథ పరంగా కొన్ని మార్పులు కూడా చేస్తూ క్రేజీ ఐడియాస్‌తో ముందుకెళ్తున్నారని ఫిలిం నగర్ టాక్.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎలక్షన్ కమీషనర్‌గా రామ్ చరణ్ కనిపించనున్నారట. దీంతో పాటు రెండు డిఫరెంట్ మాస్ షేడ్స్ చూడబోతున్నామట. దిల్ రాజు (Dil Raju) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న 50వ సినిమా కావడంతో ఈ మూవీపై ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ భారీ చిత్రంలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Ram Charan, Shankar, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు