హోమ్ /వార్తలు /సినిమా /

‘నిన్నకానీ నేడు కానీ ఎప్పడూనే రాజా’ అంటున్న రవితేజ

‘నిన్నకానీ నేడు కానీ ఎప్పడూనే రాజా’ అంటున్న రవితేజ

రవితేజ ఫైల్ ఫోటో (Ravi Teja)

రవితేజ ఫైల్ ఫోటో (Ravi Teja)

‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఈ బుధవారం కొబ్బరికాయ కొట్టాడు.

ఇంకా చదవండి ...

  ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’  సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. రీసెంట్‌గా శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు రూ.22 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ  రూ.6.20 కోట్లనే వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీని కొన్న బయ్యర్స్ నిండా మునిగిపోయారు.

  వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఈ బుధవారం కొబ్బరికాయ కొట్టాడు. అంతేకాదు ఈ రోజు నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేసాడు. ఈ మూవీకి ‘నిన్న కానీ నేడు కానీ ఎప్సుడూనే రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ మూవీ టైటిల్ మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘ఘర్షణ’ మూవీలోన్న పాట పల్లవి నుంచి తీసుకున్నారు. ఈ మూవీని ‘నేల టిక్కెట్టు’ మూవీని నిర్మించిన రామ్ తాళ్లూరే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

  రవితేజ 2018 సినిమాలు

  ఈ మూవీలో రవితేజ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ కథానాయికగా నటించనుంది. మరో హీరోయిన్‌గా ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను ఫైనలైజ్ చేశారు. ఇంకో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నాడు. ఈ మూవీని చెన్నై నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో తమిళ  నటుడు బాబీ సింహా విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. తెలుగులో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్న వీఐ ఆనంద్ ఐనా...రవితేజ వరుస ఫ్లాపులకు బ్రేకులు వేస్తాడా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు