‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ‘నేల టిక్కుట్టు’ సినిమా మాస్ రాజా కెరీర్లనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా రికార్డుల కెక్కింది.
ప్రస్తుతం రవితేజ.శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేసాడు. ఈ మూవీ సక్సెస్ అనేది హీరోగా రవితేజకు, దర్శకుడుగా శ్రీనువైట్ల కెరీర్‌కు అత్యంత కీలకం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీని ఈ నెల 16న విడుదల కానుంది. ఈ మూవీతో ఇలియానా టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడులైన ఈ మూవీ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈమూవీలో రవితేజ...త్రిపాత్రాభినయం చేసాడా..! లేకపోతే ఒక క్యారెక్టర్లో మూడు వేరియేషన్సా అనేది చూడాలి.
ఈ మూవీ తర్వాత రవితేజ...వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఈ నెల 13న కొబ్బరికాయ కొట్టనున్నాడు. ఈ విషయాన్ని ఈ మూవీ దర్శకుడు వీఐ ఆనంద్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించాడు.
Hello All,the title logo poster of my next with our favourite Mass Maharaj @RaviTeja_offl under SRT banner @SRTmovies will be out on 13-11-18.On that Happy note Happy & Safe Diwali to all!
— Vi Anand (@directorvianand) November 7, 2018
ఈ మూవీని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈ మూవీకి ‘డిస్కోరాజా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.
ఈ మూవీలో రవితేజ సరసన ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేశ్‌ను ఓ కథానాయికగా నటించనుంది. మరో హీరోయిన్గా ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను ఫైనలైజ్ చేశారు. ఇంకో హీరోయిన్ను ఎంపిక చేయాల్సివుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో సునీల్ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నాడు. ఈ మూవీని చెన్నై నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో తమిళ నటుడు బాబీ సింహా విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. తెలుగులలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్న వీఐ ఆనంద్ ...రవితేజతో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.