హోమ్ /వార్తలు /సినిమా /

Raviteja : నాని హీరోయిన్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోన్న రవితేజ..

Raviteja : నాని హీరోయిన్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతోన్న రవితేజ..

ర‌వితేజ‌.. Photo : Twitter

ర‌వితేజ‌.. Photo : Twitter

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం సంక్రాంతికి క్రాక సినిమాతో వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్నాడు.

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం సంక్రాంతికి క్రాక సినిమాతో వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఖిలాడీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ తో చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా మార్చి ఫస్ట్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట. అందులో భాగంగా ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ప్రియాంక ఆరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసిందట చిత్రబృందం. ప్రియాంక గతంలో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఇక రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. చెప్పాలంటే వరుస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజకు ‘క్రాక్’ మంచి బూస్ట్‌ను ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. ఆమెకు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వాటిని అన్నింటిని దాటుకుంటూ ఇప్పుడు భారీ హిట్‌గ అవతరించింది. రవితేజ పోతురాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. బి.మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

ఇక మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న రమేష్ వర్మ ఖిలాడీ గురించి మాట్లాడితే.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ మధ్య రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు రమేష్ వర్మ. తమిళ రాచసన్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు.


ఇక ఇదే కాంబినేషన్’లో 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఖిలాడీ చిత్రంలో హీరో పాత్రతో  సమానంగా విలన్ పాత్రను డిజైన్ చేసారు. ఈ చిత్రం కూడా తమిళంలో హిట్టైన ఓ సినిమాకు రీమేక్ అని చెబుతన్నారు. తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

First published:

Tags: Tollywood Movie News

ఉత్తమ కథలు