• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAVITEJA TO ROMANCE WITH GAALI SAMPATH ACTRESS LOVELY SINGH FOR HIS NEXT HERE ARE THE DETAILS SR

Raviteja : కొత్త హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న మాస్ మహారాజా రవితేజ..

Raviteja : కొత్త హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న మాస్ మహారాజా రవితేజ..

Raviteja and Lovely singh Photo: Twitter

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • Share this:
    Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఖిలాడి చిత్రంలో హీరో పాత్రతో  సమానంగా విలన్ పాత్రను డిజైన్ చేసారు. ఈ చిత్రం కూడా తమిళంలో హిట్టైన ఓ సినిమాకు రీమేక్ అని చెబుతన్నారు. తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం ఖిలాడి షూటింగ్ జరుపుకుంటుంటోంది. ఈ సినిమా ఇలా ఉండగానే రవితేజ మరోసినిమాకు ఓకే చెప్పాడు. నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ మార్చి సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట.

    అందులో భాగంగా ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ప్రియాంక ఆరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసిందట చిత్రబృందం. ప్రియాంక గతంలో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందట. దీంతో కొత్త హీరోయిన్ లవ్‌లీ సింగ్‌ని ఎంపిక చేసిందట చిత్రబృందం. లవ్‌లీ సింగ్ ప్రస్తుతం తెలుగులో శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న 'గాలి సంపత్‌'లో నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతోంది. గాలి సంపత్‌ శుక్రవారం అంటే మార్చి 11 ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇక రవితేజ తాజా సినిమా క్రాక్ సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు. ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. చెప్పాలంటే వరుస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజకు ‘క్రాక్’ మంచి బూస్ట్‌ను ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. ఆమెకు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వాటిని అన్నింటిని దాటుకుంటూ ఇప్పుడు భారీ హిట్‌గా అవతరించింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు