మాస్ మహారాజా రవితేజ (Raviteja ) తాజాగా ధమాకా సినిమాతో మరో హిట్ అందుకున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పెళ్లి సందD భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 2022 డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత రవితేజ నటిస్తోన్న మరో సినిమా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar Rao). ఈ మూవీ ప్యాన్ ఇండియా సినిమాను వస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాని దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా భారీ హంగులతో రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 20న దసరా కానుకగా రిలీజ్ కానుందని ప్రకటించింది టీమ్. అయితే ఇదే పండుగకు రామ్ పోతినేని, బోయపాటి సినిమా వస్తోంది. వీటికి తోడు బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇక టైగర్ నాగేశర్వరావు విషయానికి వస్తే.. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రేణు దేశాయ్ (Renu Desai) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ (GV Prakash) సంగీతం అందిస్తున్నారు.
రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు.
This year it's going to be extra special for us all ????#TigerNageswaraRao’s HUNT begins on October 20th :))) pic.twitter.com/vCOXJdiZ9k
— Ravi Teja (@RaviTeja_offl) March 29, 2023
ఇక ధమాకా తర్వాత రవితేజ నుంచి వస్తోన్న మరో ఎంటర్టైనర్ రావణాసుర. ఈ సినిమా ఎప్రిల్ 7న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ (Ravanasura Trailer ) విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. మర్డర్ చేయడం నేరం.. మర్డర్ దొరక్కకుండా చేయడం ఆర్ట్.. అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌కు రెస్పాన్స్ బాగుంది. మొత్తంగా మంచి యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రస్తుతం రావణాసుర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా.. దక్ష నగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ఇక మరోవైపు రావణాసుర (Ravanasura) నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ రైట్స్ దాదాపుగా 12 కోట్లకు పైగానే అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈసినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది.
We’re all bad in someone's story!
Presenting you all the #RavanasuraTrailer ???? - https://t.co/zfsnw1anr3 Taking over theatres from APRIL 7th :)) #RavanasuraOnApril7 pic.twitter.com/DfpEyJVI28 — Ravi Teja (@RaviTeja_offl) March 28, 2023
ఇప్పటికే ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు రవితేజ. కాగా ఆయన మరో సినిమాకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. మరోసారి హారీష్ శంకర్ ( Harish Shankar) దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ కోసం హరీష్ శంకర్ ఇప్పటికే ఓ కథను రెడీ చేశారని.. రవితేజ కూడ ఓకే అన్నారని టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందట (Mythri movie makers). గతంలో హరీష్ దర్శకత్వంలో రవితేజ షాక్, మిరపకాయ్ వంటి సినిమాలను చేశారు.
ఇక రవితేజ నటించిన ధమాకా విషయానికి వస్తే.. రెగ్యులర్ మాస్ తరహా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బీ,సీ సెంటర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. యాక్షన్ ఎంటర్టేనరర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఈ సినిమా హైయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కించారు. నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఇక ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అవ్వడంతో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల రేంజ్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా.. 14 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని 20 కోట్ల రేంజ్‌లో లాభాలను అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్‌గా అవతరించి కేక పెట్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.