Home /News /movies /

RAVITEJA SHARATH MANDAVA FILM STARTS SHOOTING HERE ARE THE DETAILS SR

Raviteja : ఎమ్మార్వోగా కొత్త అవతారంలో రవితేజ.... షూటింగ్ మొదలు..

Raviteja New movie shoot begins Photo : Twitter

Raviteja New movie shoot begins Photo : Twitter

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు.

    Ravi Teja : మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరో సినిమాను స్టార్ట్ చేశారు. రవితేజ ఓ కొత్త దర్శకుడితో పనిచేయనున్నారు. ఆ దర్శకుడి పేరే శరత్ మండవ. తెలుగు సంవత్సరం 'ఉగాది' పండుగను పురస్కరించుకుని కొత్త సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించిన ఓ ట్వీట్‌లో చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించి మరో విషయం ఏమంటే.. ఈ సినిమాకు ఎమ్మార్వో అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సింది. ఇక ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. రవితేజ సరసన హీరోయిన్’గా నాగ చైతన్య 'మజిలీ' సినిమాతో పరిచయమైన 'దివ్యాన్ష కౌశిక్' నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసిందట చిత్రబృందం. మొదటి షెడ్యూల్‌లో రవితేజపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇందులో రవితేజ లుక్.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నాడట. నాసర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతోంది.

    ఇక క్రాక్ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ఖిలాడి.. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


    ఖిలాడిలో యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను పెన్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తించిందని సమాచారం.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Raviteja, Tollywood actor

    తదుపరి వార్తలు