HOME »NEWS »MOVIE »raviteja says no to that kind of scene with the heroine for this reason here are the details sr

Raviteja : ఆ హీరోయిన్‌తో అలాంటీ సీన్‌కు నో చెప్పిన రవితేజ.. ఎందుకో తెలుసా..

Raviteja : ఆ హీరోయిన్‌తో అలాంటీ సీన్‌కు నో చెప్పిన రవితేజ.. ఎందుకో తెలుసా..
రవితేజ (Twitter/Photo)

Ravi Teja : సంక్రాంతి కానుకగా వచ్చిన రవితేజ క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా తర్వాత ఆయన ఖిలాడీ అనే యాక్షన్ ఎంటర్టైనర్‌ను చేస్తున్నాడు.

  • Share this:
    Ravi Teja : సంక్రాంతి కానుకగా వచ్చిన రవితేజ క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. చెప్పాలంటే వరుస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజకు ‘క్రాక్’ పూర్వ వైభవం తెచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. గోపిచంద్ మలినేని దర్శకుడు. ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వాటిని అన్నింటిని దాటుకుంటూ ఇప్పుడు భారీ హిట్ దిశగా ముందుగు సాగుతోంది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ రవితేజ మాస్ మసాల యాక్షన్ క్రాక్ మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్‌మెంట్‌ను ఇస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. రవితేజ ఈ సినిమాలో తన మాస్ విశ్వరూపమే చూపించాడని అంటున్నారు ఫ్యాన్స్. రవితేజ పోతురాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కూడా కేక పెట్టించారు. ఇక ఇదే కాంబినేషన్‌లో గతంలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి.. అదరగొట్టడడంతో ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యిందని భావిస్తున్నారు రవితేజ అభిమానులు. బి.మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

    క్రాక్ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తోన్నాడు. దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ మధ్య రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. తమిళ రాచసన్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు.


    View this post on Instagram

    A post shared by RAVI TEJA (@raviteja_2628)



    ఇక రమేష్ వర్మ ఇదే ఊపులో రవితేజకు మరో మంచి విజయాన్ని అందించనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇక ఇదే కాంబినేషన్’లో 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అది అలా ఈ సినిమా గురించి.. ఇందులో రవితేజ యాక్టింగ్ గురించి ఓ క్రేజీ టాక్ నడుస్తోంది.








    View this post on Instagram






    A post shared by RAVI TEJA (@raviteja_2628)








    సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఓ సీన్ కు నో చెప్పినట్టుగా సమాచారం. ఈ కథ ప్రకారం ఓ సన్నివేశంలో హీరోయిన్‌తో లిప్ లాక్ చేయాల్సి ఉందట. అయితే ఈ సీన్‌కు రవితేజ నో అన్నాడట. దీనికి కారణం కూడా ఉందట. తాను అలాంటి సీన్స్ చెయ్యనని సినిమా క్లీన్ గా ఉండాలని రవితేజ డైరెక్టర్‌తో చెప్పాడట. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ చేస్తుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఖిలాడీ చిత్రంలో హీరో పాత్రతో  సమానంగా విలన్ పాత్రను డిజైన్ చేసారు. ఈ చిత్రం కూడా తమిళంలో హిట్టైన ఓ సినిమాకు రీమేక్ అని చెబుతన్నారు. హీరోకు సమానమైన పాత్రలో అర్జున్ సర్జాను అనుకుంటున్నట్లు వార్తలు రాగా.. తాజాగా మరో పేరు వినపడుతోంది. తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం.
    Published by:Suresh Rachamalla
    First published:January 22, 2021, 06:59 IST