హోమ్ /వార్తలు /సినిమా /

Raviteja Krack on Aha : ఇంకో మూడు రోజుల్లో ఆహాలో క్రాక్.. మండిపడుతున్న రవితేజ ఫ్యాన్స్..

Raviteja Krack on Aha : ఇంకో మూడు రోజుల్లో ఆహాలో క్రాక్.. మండిపడుతున్న రవితేజ ఫ్యాన్స్..

Raviteja Krack on Aha : మాస్ మహారాజ రవితేజ నటించిన 'క్రాక్' సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Raviteja Krack on Aha : మాస్ మహారాజ రవితేజ నటించిన 'క్రాక్' సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

Raviteja Krack on Aha : మాస్ మహారాజ రవితేజ నటించిన 'క్రాక్' సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

  మాస్ మహారాజ రవితేజ నటించిన 'క్రాక్' సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న రవితేజకు మాంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇంకో రకంగా చెప్పాలంటే రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రవితేజకు మంచి హిట్ దొరికింది. ఇక కరోనా కారణంగా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీలోనే రూ. 30 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. అదే పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తే ఇప్పటికే రూ. 40 కోట్ల వసూళ్లు దాటిపోయేవని అభిమానులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీలో విడుదల అవ్వడం అభిమానులతో పాటు.. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఏమాత్రం నచ్చడంలేదు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. దీంతో ఆహా టీమ్‌పై మండిపడుతున్నారు. ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకొని పోతున్న సమయంలోనే ఈ చిత్రాన్ని జనవరి 29న 'ఆహా' ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమంటే.. విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఒప్పందం జరిగిందని అందులో భాగంగానే.. మూడు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తున్నామని ఆహా టాక్. ఆహా స్ట్రీమింగ్ సంస్థ క్రాక్ సినిమాను రూ. 8.2 కోట్లకు కొనుక్కున్నదని టాక్ ఇక ఈ ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆహాను ట్రోల్ చేస్తున్నారు రవితేజ అభిమానులు.

  క్రాక్ సినిమా విషయానికి వస్తే.. వరుస ప్లాపులతో సతమతమవుతోన్న రవితేజకు ‘క్రాక్’ పూర్వ వైభవం తెచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. గోపిచంద్ మలినేని దర్శకుడు. ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వాటిని అన్నింటిని దాటుకుంటూ ఇప్పుడు భారీ హిట్ దిశగా ముందుగు సాగుతోంది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ రవితేజ మాస్ మసాల యాక్షన్ క్రాక్ మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్‌మెంట్‌ను ఇస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. రవితేజ ఈ సినిమాలో తన మాస్ విశ్వరూపమే చూపించాడని అంటున్నారు ఫ్యాన్స్. రవితేజ పోతురాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కూడా కేక పెట్టించారు. ఇక ఇదే కాంబినేషన్‌లో గతంలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి.. అదరగొట్టడడంతో ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యిందని భావిస్తున్నారు రవితేజ అభిమానులు. బి.మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

  First published:

  Tags: Raviteja, Tollywood news

  ఉత్తమ కథలు