హోమ్ /వార్తలు /సినిమా /

రిపబ్లిక్ డే సందర్భంగా అభిమానులకు ఇదే రవితేజ గిఫ్ట్..

రిపబ్లిక్ డే సందర్భంగా అభిమానులకు ఇదే రవితేజ గిఫ్ట్..

Twitter

Twitter

మాస్‌ మహారాజ రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమాకు గోపించంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.

మాస్‌ మహారాజ రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమాకు గోపించంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘క్రాక్‌’ చిత్రబృందం రవితేజ అభిమానులుకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘క్రాక్‌’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. అంతేకాదు రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ గెటప్‌లో ఉన్న ఓ స్పెషల్‌ లుక్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. క్రాక్ సమ్మర్‌లో మే 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలకపాత్ర చేస్తున్నాడు. తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలకపాత్ర పోషిస్తోంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు. క్రాక్‌ను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నాడు. విజయ్ ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ‘క్రాక్’ కు డీఓపీగా పనిచేస్తున్నాడు. మరోవైపు రవితేజ తాజా సినిమా ‘డిస్కోరాజా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజకు జంటగా పాయల్‌ రాజ్‌పుత్‌, నభానటేశ్ నటించారు. బాబీ సింహా, వెన్నెల కిషోర్‌, సత్యరాజేశ్‌ కీలకపాత్రలను పోషించారు. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్‌గా టాక్‌తో దూసుకుపోతోంది.

First published:

Tags: Raviteja

ఉత్తమ కథలు