Hero Raviteja - Krack Movie: ఆర్థిక ఇబ్బందులు వ‌ల్ల ఆగిన ‘క్రాక్’ తొలి ఆట‌...కారణాలతో సహా పూర్తి వివరాలివే..!

Raviteja Krack Movie first show has been cancelled due to financial issues

Hero Raviteja - Krack Movie: ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మూడో చిత్రం క్రాక్‌. ఆర్థిక సమస్యల కారణంగా మల్టీప్లెక్స్‌ల్లో పడాల్సిన తొలి షో రద్దయ్యింది. పూర్తి వివరాలు...

  • Share this:
    ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మూడో చిత్రం క్రాక్‌. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కావాల్సింది. సంక్రాంతి సీజ‌న్‌లో స్టార్ట్ కావాల్సిన తొలి సినిమా కూడా ఇదే. లాస్ట్ ఇయ‌ర్ ఎండింగ్‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్ సోలో బ‌తుకే సో బెట‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టికీ, ఆ సినిమాకు పెద్ద‌గా జ‌నాల నుంచి స్పంద‌న లేదు. సో ఇప్పుడు ఓ రేంజ్ హీరో సినిమా రిలీజ్‌, అది కూడా సంక్రాంతి సీజ‌న్‌, వీకెండ్ కావ‌డంతో క్రాక్ మీద చాలా ఆశ‌లే పెట్టుకున్నారు అభిమానులు. అయితే అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ క్రాక్ సినిమా మార్నింగ్ షోలు ర‌ద్ద‌య్యాయి.

    ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే క్రాక్ షోలు ర‌ద్ద‌య్యాయ‌న్న‌ది టాక్‌. నిర్మాత‌కు సంబంధించిన గ‌త సినిమాల తాలూకు అప్పుల కార‌ణంగానే ఈ సినిమాకు ఫైనాన్షియ‌ల్ క్లియ‌రెన్స్ రాలేదు. సో ఆ ఒత్తిడి, భారం మొత్తం ర‌వితేజ సినిమా మీద ప‌డింది.చివ‌రి నిమిషం వ‌ర‌కు నిర్మాత ఠాగూర్ మ‌ధు త‌న గ‌త చిత్రాల తాలూకు ఫైనాన్షియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ ని సాల్వ్ చేసుకోక‌పోవ‌డంతో ఆ ఎఫెక్ట్ ర‌వితేజ సినిమా మీద ప‌డింది. ప్ర‌స్తుతం టాగూర్ మ‌ధు చెన్నైలో ఫైనాన్షియ‌ల్ సెటిల్‌మెంట్స్ చేసుకుంటున్నారు. అది క్లియ‌ర్ అయితేగానీ, మార్నింగ్ షోలు ప‌డేలా లేవు.

    డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో పాటు ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్న స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌కు ఇది ర‌కంగా రీ ఎంట్రీ మూవీ అని చెప్పొచ్చు. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ నెగ‌టివ్ రోల్స్ చేశారు.
    Published by:Anil
    First published: